కమ్యూనిస్టులు టీఆర్ఎస్‌తో అందుకే జట్టు కట్టారట!
విధాత: సీఎం కేసీఆర్ రాజకీయ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. కొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. ఇటీవల నూతన సచివాలయానికి డాక్టర్ బీ.ఆ ర్. అంబేద్కర్ పేరు పెట్టాలనే నిర్ణయం ఆ కోవలోనిదే. అయితే కొన్ని ఎన్నికల సందర్భంగా కమ్యునిస్ట్ పార్టీలు టీఆర్ఎస్‌కు రాజకీయంగా మద్దతు ఇవ్వడంపై సోషల్ మీడియాలో.. కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాల్లో చర్చ జరిగింది. కమ్యూనిస్టులు పూర్వ వైభవం పొందాలంటే కొట్లాడాలి కానీ ఒక పార్టీకి మద్దతిస్తే ప్రయోజనం ఏ మ్మున్నదని ప్రశ్నిస్తున్నారు. అయితే […]

విధాత: సీఎం కేసీఆర్ రాజకీయ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. కొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. ఇటీవల నూతన సచివాలయానికి డాక్టర్ బీ.ఆ ర్. అంబేద్కర్ పేరు పెట్టాలనే నిర్ణయం ఆ కోవలోనిదే. అయితే కొన్ని ఎన్నికల సందర్భంగా కమ్యునిస్ట్ పార్టీలు టీఆర్ఎస్‌కు రాజకీయంగా మద్దతు ఇవ్వడంపై సోషల్ మీడియాలో.. కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాల్లో చర్చ జరిగింది.
కమ్యూనిస్టులు పూర్వ వైభవం పొందాలంటే కొట్లాడాలి కానీ ఒక పార్టీకి మద్దతిస్తే ప్రయోజనం ఏ మ్మున్నదని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది కొంతవరకు నిజమే కావొచ్చు. కానీ కామన్ కాజ్ కోసం కొట్లాడే సమయంలో ఓట్ల చీలిక తెచ్చి బీజేపీ లాంటి మతతత్వ పార్టీ బలోపేతానికి అవకాశం ఇవ్వకూడదనేది వారి వాదన.
అంతేకాదు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. ఇక్కడ రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కూడా పూర్తి పట్టు సాధించలేక పోయింది. ఇటీవలి కాలంలో బీజేపీ ఈ రెండు జిల్లాలపై నజర్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ నుంచి, టీఆర్ఎస్ నుంచి వలసలు ప్రోత్సహించి పాగా వేయాలని భావిస్తున్నది.
ముందు కాంగ్రెస్‌ను, తర్వాత కమ్యూనిస్టులను దెబ్బ కొట్టాలనేది వారి వ్యూహంగా కనిపిస్తున్నది. అందుకే రాజకీయంగా టీఆర్ఎస్, కమ్యూనిస్టుల ఉమ్మడి ప్రత్యర్థి అయిన బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనైనా బలోపేతం కాకుండా అడ్డుకోవాలన్నది ఇరువురి అభిప్రాయం. అందులో భాగంగానే టీఆర్ఎస్‌తో కమ్యూనిస్టులు కలిసి సాగుతున్నారు వాదన వినిపిస్తోంది.
కేసీఆర్ కూడా కమ్యూనిస్టులను కలుపుకుంటే రేపు జాతీయ స్థాయిలో రాష్ట్రంలోనూ రాజకీయంగా తనకు లాభం చేకూరుతుంది అనే భావనలో ఉన్నారు. నల్గొండలో రెండు, ఖమ్మంలో ఒక లోక్ సభ స్థానం దక్కించుకోవచ్చని గులాబీ బాస్ లెక్కలు వేసుకున్నారట. ఇదీ అసలు కథ.