High Court | కల్లు దుకాణాలు, అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టుకు లేఖ
High Court హైదరాబాద్, విధాత: మహబూబ్‌నగర్ జిల్లాలో గత ఏప్రిల్‌లో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందిన విషయాన్ని హైకోర్టు పిల్‌గా విచారణకు స్వీకరించింది. కల్తీ కల్లు తాగి 40 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వీరిలో ముగ్గురు మృతిచెందారు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా మహబూబ్‌నగర్‌కు చెందిన అనిల్‌కుమార్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. బాధ్యులైన అధికారులు, కల్లు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని […]

High Court
హైదరాబాద్, విధాత: మహబూబ్‌నగర్ జిల్లాలో గత ఏప్రిల్‌లో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందిన విషయాన్ని హైకోర్టు పిల్‌గా విచారణకు స్వీకరించింది. కల్తీ కల్లు తాగి 40 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వీరిలో ముగ్గురు మృతిచెందారు.
పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా మహబూబ్‌నగర్‌కు చెందిన అనిల్‌కుమార్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. బాధ్యులైన అధికారులు, కల్లు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని హైకోర్టు పిల్‌గా విచారణకు స్వీకరించింది.
ప్రతివాదులుగా ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లు, ఎస్ఐలను చేర్చింది. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది.