ఎం-ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..! దాంతో ప్రయోజనాలంటో తెలుసా..!

ప్రస్తుత కాలంలో ఆధార్‌ ప్రాముఖ్యం భారీగా పెరిగింది. సిమ్‌ కార్డు నుంచి బ్యాంకు ఖాతా వరకు ఆధార్‌ తప్పనిసరి

ఎం-ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..! దాంతో ప్రయోజనాలంటో తెలుసా..!

M-Aadhaar | ప్రస్తుత కాలంలో ఆధార్‌ ప్రాముఖ్యం భారీగా పెరిగింది. సిమ్‌ కార్డు నుంచి బ్యాంకు ఖాతా వరకు ఆధార్‌ తప్పనిసరి. అలాగే, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సైతం ఆధార్‌ కావాల్సిందే. ప్రస్తుతం ఆధారే అన్నింటికి చిరునామాగా మారింది. ఈ క్రమంలో ఉడాయ్‌ (యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా-UIDAI) సరికొత్త ఫీచర్లను సైతం తీసుకువస్తున్నది.


యూజర్లు తమ ఆధార్‌ను యాక్సెస్‌ చేసుకునేందుకు వెబ్‌సైట్‌తో పాటు మొబైల్‌ యాప్‌ను అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే ఎం-ఆధార్‌ పేరిట మొబైల్‌ యాప్‌ను తీసుకువచ్చింది. ఈ యాప్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..!


మొదట గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఎం-ఆధార్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం యాప్‌ను ఓపెన్‌ చేశాక.. ‘రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’పై క్లిక్ చేయాలి. అనంతరం ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌ను క్రియేట్‌ చేసేందుకు పిన్‌ లేదంటే పాస్‌వర్డ్‌ జనరేట్‌ చేయాల్సి ఉంటుంది. మొదట ఆధార్‌ నంబర్‌ వివరాలను ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత కాప్చా కోడ్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌ చేస్తే రిజిస్టర్డ్‌‌‌‌‌‌‌‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్‌ చేయాలి. దీంతో రిజిస్ట్రేషన్‌ పూర్తి కాగానే సంబంధిత యూజర్‌కు సంబంధించిన వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.


మెనూలో కింద కనిపించే ‘మై ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ట్యాబ్‌ను క్లిక్ చేసి పిన్‌‌‌‌‌‌‌‌ లేదంటే పాస్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌ను ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉంటుంది. డ్యాష్‌ బోర్డ్‌ ఓపెన్‌ అవుతుంది. ఇందులో మీకు కావాల్సిన సేవలను ఉపయోగించుకోవచ్చు. దీంతో ఉపయోగం ఏంటంటే.. ఆధార్‌కార్డు వివరాలను ఆఫ్‌లైన్‌ మోడ్‌లోనూ చూసుకునే వీలుంటుంది. ఒకే ఫోన్‌లో ఐదుగురు కుటుంబీకుల ఆధార్‌ వివరాలను స్టోర్‌ చేసుకోవచ్చు.


ఎక్కడికైనా వెళ్లిన సమయంలో ప్రతీసారి ఆధార్‌కార్డు వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం రాదు. ఆధార్‌కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో పాటు అప్‌డేట్‌ చేసుకోవచ్చు. వర్చువల్‌ ఐడీ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆధార్‌ కార్డును నేరుగా ఫోన్‌లోనే లాక్‌, అన్‌లాక్‌ సైతం చేయొచ్చు. అలాగే, బయోమెట్రిక్‌ లాక్‌ చేయడంతో పాటు బ్యాంక్‌ అకౌంటర్లకు సైతం అనుసంధానం చేసుకునే వీలుంటుంది.