వివాహేత‌ర సంబంధం.. భ‌ర్త‌ను 22 ముక్క‌లుగా న‌రికేసింది

Delhi | దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన శ్ర‌ద్ధా వాక‌ర్ హ‌త్య ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే.. అలాంటి ఘ‌ట‌నే మరొక‌టి చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన ఓ వ్య‌క్తి మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్న విష‌యం భార్య‌కు తెలిసింది. దీంతో త‌న కుమారుడి సాయంతో భ‌ర్త‌ను 22 ముక్క‌లుగా న‌రికేసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని పాండ‌వ్ న‌గ‌ర్‌లో ఈ ఏడాది జూన్ నెల‌లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి శ‌రీర భాగాలు ల‌భ్య‌మ‌య్యాయి. ఈ శ‌రీర భాగాల‌ను […]

వివాహేత‌ర సంబంధం.. భ‌ర్త‌ను 22 ముక్క‌లుగా న‌రికేసింది

Delhi | దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన శ్ర‌ద్ధా వాక‌ర్ హ‌త్య ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే.. అలాంటి ఘ‌ట‌నే మరొక‌టి చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన ఓ వ్య‌క్తి మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్న విష‌యం భార్య‌కు తెలిసింది. దీంతో త‌న కుమారుడి సాయంతో భ‌ర్త‌ను 22 ముక్క‌లుగా న‌రికేసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని పాండ‌వ్ న‌గ‌ర్‌లో ఈ ఏడాది జూన్ నెల‌లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి శ‌రీర భాగాలు ల‌భ్య‌మ‌య్యాయి. ఈ శ‌రీర భాగాల‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ కేసులో పురోగ‌తి కనిపించ‌లేదు. అయితే శ్ర‌ద్ధా వాక‌ర్ హ‌త్య అనంత‌రం ఈ కేసు కూడా వెలుగులోకి వ‌చ్చింది. ద‌ర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలించ‌గా ఈ హ‌త్య కేసు బ‌య‌ట‌ప‌డింది.

ఢిల్లీలోని పాండ‌వ్ న‌గ‌ర్‌కు చెందిన అంజ‌న్ దాస్‌కు మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం ఉంది. ఈ విష‌యం భార్య పూన‌మ్‌కు తెలిసింది. ఎలాగైనా త‌న భ‌ర్త‌ను మ‌ట్టుబెట్టాల‌ని నిర్ణ‌యించుకుంది. కుమారుడు దీప‌క్ సాయంతో భ‌ర్త‌కు నిద్ర మాత్ర‌లు ఇచ్చింది. అత‌ను స్పృహా కోల్పోయిన త‌ర్వాత ప‌దునైన ఆయుధంతో దాస్ శ‌రీరాన్ని 22 ముక్క‌లుగా న‌రికారు.

అనంత‌రం ఆ భాగాల‌ను ఓ బ్యాగులో చుట్టి.. స‌మీప ప్రాంతంలో ప‌డేశారు. అయితే దీప‌క్‌ అనేక‌సార్లు ఆ ఏరియాకు వ‌చ్చిన‌ట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. దీంతో దీప‌క్‌ను అరెస్టు చేసి విచారించ‌గా అస‌లు విష‌యం వెలుగు చూసింది. దీప‌క్‌, పూన‌మ్‌ను పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు.