లంగర్‌హౌస్‌లో దారుణం.. పట్టపగలే నడిరోడ్డుపై భార్యను చంపిన భర్త
విధాత: ఆ దంపతులకు వివాహమై ఏడేండ్లు అవుతోంది. కానీ సంవత్సర కాలం నుంచి ఆ పచ్చని కాపురంలో కలహాలు మొదలయ్యాయి. గొడవల నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. భార్య దూరంగా ఉండటంతో, తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన భర్త.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెను దారుణంగా చంపాడు. ఈ ఘటన హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లంగర్‌హౌస్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో మహమ్మద్ యూసుఫ్, కరీనా బేగం […]

విధాత: ఆ దంపతులకు వివాహమై ఏడేండ్లు అవుతోంది. కానీ సంవత్సర కాలం నుంచి ఆ పచ్చని కాపురంలో కలహాలు మొదలయ్యాయి. గొడవల నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. భార్య దూరంగా ఉండటంతో, తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన భర్త.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెను దారుణంగా చంపాడు. ఈ ఘటన హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. లంగర్‌హౌస్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో మహమ్మద్ యూసుఫ్, కరీనా బేగం అనే దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. కరీనా ఓ ప్రయివేటు స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. వీరికి వివాహమై ఏడేండ్లు అవుతోంది. గత ఏడాది కాలం నుంచి దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి.
భర్త వేధింపులు భరించలేక.. ఆమె మహమ్మద్‌కు దూరంగా ఉంటుంది. దీన్ని జీర్ణించుకోలేని భర్త.. కరీనాను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం స్కూల్‌కు వెళ్తున్న కరీనాను మహమ్మద్ అనుసరించాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఇనుప రాడ్‌తో తలపై బాదడంతో ఆమె కుప్పకూలిపోయింది. అక్కడే ప్రాణాలు కోల్పోయింది. అప్రమత్తమైన స్థానికులు యూసుఫ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.