ఆన్‌లైన్‌లో దోస్తులతో మాట్లాడుతుందని..
సోషల్ మీడియాలో భార్య యాక్టివ్ ఉండటం, స్నేహితులతో నిత్యం చాలాసేపు మాట్లాడుతుండటం ఇష్టం లేని భర్త ఆమె గొంతు కోసి చంపేశాడు.

- భార్య గొంతు కోసి చంపేశాడు
- పశ్చిమ బెంగాల్‌లో దారుణ ఘటన
విధాత: సోషల్ మీడియాలో భార్య యాక్టివ్ ఉండటం, స్నేహితులతో నిత్యం చాలాసేపు మాట్లాడుతుండటం ఇష్టం లేని భర్త ఆమె గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని సౌత్ 24 పరగణాస్ జిల్లా జోయ్‌నగర్‌లోని హరినారాయణపూర్‌లో శుక్రవారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పరిమళ్, అపర్ణ బైద్య 32 ఆలుమగలు. అపర్ణ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండేది. స్నేహితులతో నిత్యం చాలా సే మాట్లాడేది. ఆమె తీరు భర్తకు నచ్చలేదు. సోషల్ మీడియాలో స్నేహాలు మానుకోవాలని భర్త పలుమార్లు సూచించాడు. ఈ అంశంపై నిత్యం ఆలుమగల మధ్య గొడవలు జరిగేవి. శుక్రవారం మధ్యాహ్నం మళ్లీ గొడవ మొదలైంది.
కూరగాయల కట్‌ఛేసే కత్తితో భార్య గొంతు కోసి చంపి అక్కడ నుంచి పరారయ్యాడు. మైనర్ కొడుకు ఇంటికి వచ్చి చూడగా.. తల్లి రక్తపు మడుగులో పడి ఉన్నది. స్థానికుల సహాయంతో దవాఖానకు తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ధ్రవీకరించారు.
తన తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతున్నారని, తన తండ్రి తన తల్లిని ముక్కలుగా నరికివేస్తానని చాలా సందర్భాలలో బెదిరించాడని బాలుడు చెప్పాడు. ఆమె సోషల్ మీడియా యాక్టివిటీని అంగీకరించని కారణంగానే భర్త ఆమెను హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నట్టు పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. అపర్ణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి హత్య చేసిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.