Hyderabad | తరుచూ ఆలస్యంగా ఇంటికి.. అడిగినందుకు తండ్రిని గొంతుకోసి చంపిన కూతురు
Hyderabad | విధాత, క్షణికావేశంలో కన్నతండ్రినే గొంతుకోసి చంపిందొక కూతురు. తరిగిపోతున్న కుటుంబ అనుబంధాలకు అద్దం పట్టిన ఈ ఘటన హైద్రాబాద్ అంబర్ పేట తులసీరామ్ నగర్‌లో చోటుచేసుకుంది. జగదీశ్ అనే వ్యక్తి తన కూతురు నిఖితతో కలిసి అంబర్‌పేటలో నివసిస్తున్నాడు. తండ్రి కూలీ పనులకు వెలుతుండగా, నిఖిత అఫ్జల్‌గంజ్‌లో ఓ దుకాణంలో పనిచేస్తుంది. తరుచూ రాత్రి వేళ ఆలస్యంగా ఇంటికి వస్తున్న నిఖిత శనివారం అర్దరాత్రి ఇంటికి చేరుకుంది. దీంతో నీ డ్యూటీ టైం ఎన్ని […]

Hyderabad |
విధాత, క్షణికావేశంలో కన్నతండ్రినే గొంతుకోసి చంపిందొక కూతురు. తరిగిపోతున్న కుటుంబ అనుబంధాలకు అద్దం పట్టిన ఈ ఘటన హైద్రాబాద్ అంబర్ పేట తులసీరామ్ నగర్‌లో చోటుచేసుకుంది. జగదీశ్ అనే వ్యక్తి తన కూతురు నిఖితతో కలిసి అంబర్‌పేటలో నివసిస్తున్నాడు.
తండ్రి కూలీ పనులకు వెలుతుండగా, నిఖిత అఫ్జల్‌గంజ్‌లో ఓ దుకాణంలో పనిచేస్తుంది. తరుచూ రాత్రి వేళ ఆలస్యంగా ఇంటికి వస్తున్న నిఖిత శనివారం అర్దరాత్రి ఇంటికి చేరుకుంది. దీంతో నీ డ్యూటీ టైం ఎన్ని గంటలని, ఎందుకు ఇంత ఆలస్యంంగా వస్తున్నావంటు కూతురును తండ్రి జగదీశ్ ప్రశ్నించాడు.
దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం ముదరగా, ఆవేశంతో పగిలిన అద్దం ముక్కతో తండ్రి గొంతులో గుచ్చింది. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడిపోయిన జగదీశ్‌ను ఇరుగుపొరుగు ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతు ఆదివారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిఖితను అరెస్టు చేశారు. తనను తండ్రి మందలించాడన్న ఆవేశంలో అలా చేశానని నిఖిత విచారణలో తెలిపింది.