Hyderabad | హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో లైంగిక ఆరోపణలు.. OSD సస్పెండ్
Hyderabad | విధాత: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థినీలపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పాఠశాల ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న హరికృష్ణను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఈ ఘటనపై వాస్తవ నివేదిక సమర్పించాలని ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని మంత్రి నియమించారు. ఓఎస్డీపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. […]

Hyderabad |
విధాత: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థినీలపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పాఠశాల ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న హరికృష్ణను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
ఈ ఘటనపై వాస్తవ నివేదిక సమర్పించాలని ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని మంత్రి నియమించారు. ఓఎస్డీపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ స్పోర్ట్స్, SATS MD & VC శైలజ రామయ్యార్ , క్రీడా శాఖ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. క్రీడాకారిణిలకు , వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు వారిలో ధైర్యం నింపేందుకు వెంటనే చర్యలను చేపట్టామన్నారు. భాధ్యులపై నివేదిక వచ్చిన వెంటనే తగిన చర్యలు చేపడతామన్నారు.
గతంలో మహిళల పట్ల జరిగిన లైంగిక వేధింపులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకున్న విషయం అందరికి విదితమే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా షీ టీమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కించపరిచే విధంగా మాట్లాడిన ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
ముగిసిన విచారణ..
హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై విచారణ ముగిసింది. చైల్డ్ రైట్స్ కమిటీ సభ్యులు సస్పెండైన ఓఎస్‌డీ హరికృష్ణతో పాటు, అమ్మాయిలను ఒక్కొక్కరిగా పిలిచి విచారించారు. ఆరున్నర గంటల పాటు కొనసాగిన విచారణ అనంతరం విద్యార్థుల స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ కొత్త ఓఎస్‌డీగా సుధాకర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.