‘మీది మొత్తం 1000 అయింది.. యూజ‌ర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా..’ హైద‌రాబాద్ పోలీసుల ట్వీట్ వైర‌ల్

సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన కుమారీ ఆంటీ డైలాగ్ ‘మీది థౌజండ్ రూపీస్ అయింది. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’. ఈ ఒక్క డైలాగ్‌తో కుమారీ ఆంటీ లైఫే మారిపోయింది

  • By: Somu    latest    Feb 20, 2024 12:35 PM IST
‘మీది మొత్తం 1000 అయింది.. యూజ‌ర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా..’ హైద‌రాబాద్ పోలీసుల ట్వీట్ వైర‌ల్

హైద‌రాబాద్ : సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన కుమారీ ఆంటీ డైలాగ్ ‘మీది థౌజండ్ రూపీస్ అయింది. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’. ఈ ఒక్క డైలాగ్‌తో కుమారీ ఆంటీ లైఫే మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ డైలాగ్ బాగా ప్రాచుర్యం పొందింది. సేమ్ ఆ డైలాగ్‌ను సిటీ ట్రాఫిక్ పోలీసులు కాపీ కొట్టారు. కుమారీ ఆంటీ స్టైల్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనులకు నవ్విస్తూనే చురకలు వేశారు.


హైదరాబాద్‌లో ఓ వాహనదారుడు హెల్మెట్ ధరించకుండా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు. దీనిని ట్రాఫిక్ పోలీసులు ఫొటో తీశారు. అయితే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడానికి పోలీసులు కొత్త విధానాన్ని అవలంభించారు. ఆ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ ‘‘మీది మొత్తం 1000 అయ్యింది.. యూజర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో క్యాప్ష‌న్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. కుమారి ఆంటీ ఏ డైలాగ్ తో అయితే ఫేమస్ అయ్యిందో ఇప్పుడు అదే డైలాగ్ మళ్లీ ట్రెండ్ లోకి వచ్చింది.