Hyderabad | రేపు ఉద‌యం 4 నుంచే హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు.. పార్కులు మూసివేత‌

Hyderabad విధాత‌: తెలంగాణ నూత‌న స‌చివాల‌యం ప్రారంభోత్స‌వం నేప‌థ్యంలో ఆదివారం న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు హైద‌రాబాద్ పోలీసులు వెల్ల‌డించారు. ఈ ట్రాఫిక్ ఆంక్ష‌లు స‌చివాల‌యం ప‌రిస‌రాల్లో ఉద‌యం 4 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌న్నారు. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబ‌నీ పార్కుల‌ను కూడా మూసివేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని ప‌ర్యాట‌కులు గ‌మ‌నించాల‌ని పోలీసులు సూచించారు. ఇక స‌చివాల‌యం వైపు వ‌చ్చే వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని సూచించారు. ఖైర‌తాబాద్‌లోని […]

Hyderabad | రేపు ఉద‌యం 4 నుంచే హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు.. పార్కులు మూసివేత‌

Hyderabad

విధాత‌: తెలంగాణ నూత‌న స‌చివాల‌యం ప్రారంభోత్స‌వం నేప‌థ్యంలో ఆదివారం న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు హైద‌రాబాద్ పోలీసులు వెల్ల‌డించారు. ఈ ట్రాఫిక్ ఆంక్ష‌లు స‌చివాల‌యం ప‌రిస‌రాల్లో ఉద‌యం 4 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌న్నారు.

ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబ‌నీ పార్కుల‌ను కూడా మూసివేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని ప‌ర్యాట‌కులు గ‌మ‌నించాల‌ని పోలీసులు సూచించారు. ఇక స‌చివాల‌యం వైపు వ‌చ్చే వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని సూచించారు.

ఖైర‌తాబాద్‌లోని వీవీ విగ్ర‌హం జంక్ష‌న్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్ష‌న్, ర‌వీంద్ర భార‌తి జంక్ష‌న్, మింట్ కంపౌండ్ రోడ్డు, తెలుగు త‌ల్లి జంక్ష‌న్, నెక్లెస్ రోట‌రీ, న‌ల్ల‌గుట్ట జంక్ష‌న్, క‌ట్ట మైస‌మ్మ టెంపుల్, ట్యాంక్ బండ్, లిబ‌ర్టీ జంక్ష‌న్ల వైపు వాహ‌నాల‌కు అనుమ‌తించ‌రు.

ఆర్టీసీ బ‌స్సులు మ‌ళ్లింపులు ఇలా..

అఫ్జ‌ల్ గంజ్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బ‌స్సులు.. ర‌వీంద్ర భార‌తి, తెలుగు త‌ల్లి ఫ్లై ఓవ‌ర్, క‌ట్ట మైస‌మ్మ టెంపుల్, లోయ‌ర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్, క‌వాడిగూడ మీదుగా సికింద్రాబాద్ చేరుకోవాలి.