YS రాజశేఖర్ రెడ్డి.. పగబట్టడం వల్లే పాలకుర్తికి వచ్చా: ఎర్రబెల్లి
కాంగ్రెస్ పార్టీకి రాకపోతే రాజకీయాల్లో లేకుండా చేస్తానన్నారు పోటీ చేస్తానని రిజర్వ్ స్థానాలు చేశారు అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రి ఎర్రబెల్లి హాట్ కామెంట్స్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నేను ఎంపీగా గెలిచిన తర్వాత నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నారు. నేను రాను సార్ అంటే రాజకీయాల్లో అడుగుపెట్టకుండా చేస్తాను అన్నారు. మీరు ఏమైనా చేయండి సార్ అని నేనన్నాను. దీంతో ఆయన పగబట్టి రెండు ఎంపీ స్థానాలను, వర్ధన్నపేట […]

- కాంగ్రెస్ పార్టీకి రాకపోతే రాజకీయాల్లో లేకుండా చేస్తానన్నారు
- పోటీ చేస్తానని రిజర్వ్ స్థానాలు చేశారు
- అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రి ఎర్రబెల్లి హాట్ కామెంట్స్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నేను ఎంపీగా గెలిచిన తర్వాత నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నారు. నేను రాను సార్ అంటే రాజకీయాల్లో అడుగుపెట్టకుండా చేస్తాను అన్నారు. మీరు ఏమైనా చేయండి సార్ అని నేనన్నాను.
దీంతో ఆయన పగబట్టి రెండు ఎంపీ స్థానాలను, వర్ధన్నపేట ఎమ్మెల్యే స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన కామెంట్స్ చేశారు.
ఇక పాలకుర్తికి వస్తే ఇక్కడి ప్రజలు గొప్పగా ఆదరించి రెండుసార్లు కష్టాల్లో గెలిపించారు. మూడోసారి ఇక దంచేసి గెలిపించారు. పాలకుర్తి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ఇదంతా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే నేను ఎమ్మెల్యే, మంత్రిని అయ్యేవాడిని కాదని అన్నారు.
నేను మంత్రి అయిన వెంటనే మొదట మా తండ్రి విగ్రహానికి దండ వేసి అక్కడ నుంచి నేరుగా ఎస్సీ అయినా అంబేద్కర్ కట్టయ్య దగ్గరికి వెళ్లి కాళ్లు మొక్కాను. అంబేద్కర్ అంటే నాకు ఎనలేని గౌరవమన్నారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని దేవరుప్పల మండలం, కామారెడ్డి గూడెంలో శనివారం అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేయడం గమనార్హం.