Justice Rohit Deo | బాంబే హైకోర్టు జడ్జి రాజీనామా.. వ్యక్తిత్వాన్ని చంపుకొని పనిచేయలేనని వ్యాఖ్య
Justice Rohit Deo విధాత: బాంబే హైకోర్టు (Bombay High-court) లో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రోహిత్ దేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. న్యాయమూర్తి పదవికి రాజీనామా చేస్తున్నానని కోర్టు రూంలో అందరి ముందూ ప్రకటించారు. ప్రస్తుతం నాగ్‌పూర్ బెంచ్‌లో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం జస్టిస్ రోహిత్ కోర్టు రూంలో మాట్లాడుతూ తాను వ్యక్తిగత గౌరవాన్ని చంపుకొని పని చేయలేనని వ్యాఖ్యానించారు. 'ఈ కోర్టులో పని చేస్తున్న వారందరికీ క్షమాపణలు చెబుతున్నా. మీరు […]

Justice Rohit Deo
విధాత: బాంబే హైకోర్టు (Bombay High-court) లో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రోహిత్ దేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. న్యాయమూర్తి పదవికి రాజీనామా చేస్తున్నానని కోర్టు రూంలో అందరి ముందూ ప్రకటించారు. ప్రస్తుతం నాగ్‌పూర్ బెంచ్‌లో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం జస్టిస్ రోహిత్ కోర్టు రూంలో మాట్లాడుతూ తాను వ్యక్తిగత గౌరవాన్ని చంపుకొని పని చేయలేనని వ్యాఖ్యానించారు.
‘ఈ కోర్టులో పని చేస్తున్న వారందరికీ క్షమాపణలు చెబుతున్నా. మీరు బాగా పనిచేయాలని కోప్పడ్డాను తప్ప.. మీరంటే ద్వేషం లేదు. మీరంతా నా కుటుంబసభ్యులు. నేను రాజీనామా చేస్తున్నానని చెప్పడానికి బాధపడుతున్నా. వ్యక్తిత్వాన్ని చంపుకొని పనిచేయలేను’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ.. వ్యక్తిగతమైన కారణాల వల్లే రాజీనామా చేశానని జస్టిస్ రోహిత్ పేర్కొన్నారు. రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపేశానని తెలిపారు.
ప్రొఫెసర్ సాయిబాబా కేసులో సంచలన తీర్పు
మావోయిస్టులతో సంబంధాలున్నాయని అరెస్టయిన దిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కేసును జస్టిస్ దేవ్ విచారించారు. ఈ కేసులో విచారణ డొల్లగా ఉందని, ఆయనపై ఉన్న ఆరోపణలు యూఏపీఏ పరిధిలోకి రావని పేర్కొంటూ.. సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించారు. అంతే కాకుండా ఆయనకు విధించిన జీవిత ఖైదును నిలిపివేశారు. అనంతరం ఈ నిర్ణయాన్ని సమీక్షించిన సుప్రీం కోర్టు దేవ్ తీర్పును నిలిపివేసింది. కేసును తొలి దశ నుంచి వాదించాలని నాగ్‌పుర్ బెంచ్‌ను ఆదేశించింది. 2017లో జడ్జిగా నియమితులైన దేవ్ పదవీకాలం.. 2025 డిసెంబరు వరకు ఉంది.