Samantha | విజయ్ దేవరకొండ అలాంటివాడు అనుకున్నా.. కానీ?: సమంత
Samantha | సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన మూవీ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఇందులో భాగంగా రీసెంట్‌గా జరిగిన ‘ఖుషి మ్యూజికల్ కన్సర్ట్’లో స్టేజ్‌పై విజయ్, సమంత కలిసి చేసిన డ్యాన్స్ వైరల్ అయింది. ఇద్దరూ ఈ పెర్ఫార్మెన్స్‌లో కాస్త హద్దులు దాటి మరీ చేశారని నెటిజన్లు చెవులు కొరుక్కున్న సంగతి అలా ఉంచితే.. తాజాగా సమంత తన కో స్టార్ విజయ్ […]

Samantha |
సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన మూవీ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఇందులో భాగంగా రీసెంట్‌గా జరిగిన ‘ఖుషి మ్యూజికల్ కన్సర్ట్’లో స్టేజ్‌పై విజయ్, సమంత కలిసి చేసిన డ్యాన్స్ వైరల్ అయింది.
ఇద్దరూ ఈ పెర్ఫార్మెన్స్‌లో కాస్త హద్దులు దాటి మరీ చేశారని నెటిజన్లు చెవులు కొరుక్కున్న సంగతి అలా ఉంచితే.. తాజాగా సమంత తన కో స్టార్ విజయ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడా వ్యాఖ్యలు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా ప్రమోషన్స్ సమంత లేకపోయినా ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. తనకున్న మయోసైటిస్ వ్యాధికి అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉండటంతో.. ముందే తను అంగీకరించిన షూట్స్ పూర్తి చేసేసింది సమంత.
ఇక త్వరలో విడుదల కాబోతున్న ‘ఖుషి’ సినిమా ప్రమోషన్స్ కూడా పూర్తయితే సమంత మరికొంత కాలం పాటు అమెరికాలోనే ఉండాలనేది ప్లాన్.. అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా తమిళం, తెలుగు ఇలా పలు భాషల్లో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది చిత్ర యూనిట్. తమిళంలో జరిగిన ఓ ఇంటర్య్వూలో విజయ్ గురించి సమంత కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
విజయ్‌ని చూడగానే అతను ఓ రౌడీ హీరో అనుకుంటారు, నేనూ అలానే అనుకున్నాను. నిజానికి విజయ్ దేవరకొండ చాలా బుద్ధిమంతుడు. అతనికి ఒక్క చెడు అలవాటు కూడా లేదు. రోజూ ఉదయాన్నే వ్యాయామం చేస్తాడు. వృత్తిపరంగా చాలా క్రమశిక్షణతో ఉంటాడు. ఇవన్నీ తెలిశాక నేను పూర్తిగా అతనిపట్ల నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను అని కితాబిచ్చింది.
మొత్తానికి విజయ్ చాలా బుద్ధిమంతుడని, మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పుకొచ్చింది సమంత. దీంతో.. సమంత ఏమైనా విజయ్‌ని ఇష్టపడుతుందా? అందుకే మొన్న స్టేజ్‌పై అలా.. ఇప్పుడిలా కామెంట్స్ చేస్తుంది అంటూ కొందరు అప్పుడే వార్తలు అల్లేస్తున్నారు. మరి వారిద్దరి మధ్య ఏం ఉందనేది పక్కన పెడితే.. సమంత చెప్పిన ఈ మాటలతో రౌడీ ఫ్యాన్స్ యమా హ్యాపీగా ఉన్నారు.
దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ‘ఖుషి’ సినిమా తెరకెక్కింది. అయితే ఇద్దరికీ అదే సమంత, విజయ్‌లకు ఈమధ్య కాలంలో హిట్ లేకపోవడంతో ‘ఖుషి’ మూవీ మీద ఇద్దరూ బోలెడన్నీ ఆశలు పెట్టుకున్నారు.
అలాగే అభిమానులు కూడా భారీ అంచనాలతో ఉన్నారు. ఇక మూవీ పాటలు, ప్రోమోలు బాగానే హైప్ పెంచుతున్నాయి. ‘ఖుషి’ హిట్ కొట్టడం ఖాయం అనేలా ఇద్దరి ఫ్యాన్స్ కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. చూద్దాం మరి ఎటువంటి రిజల్ట్ వస్తుందో..