YS Sharmila | దమ్ముంటే సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు ఇవ్వాలి.. సీఎం కేసీఆర్‌కు షర్మిల సవాల్
YS Sharmila విధాత: దమ్ముంటే సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల ట్వీట్టర్ వేదికగా సవాల్ చేశారు. ఉద్యమం సెంటిమెంట్‌తో తొలిసారి, తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో రెండోసారి ముఖ్యమంత్రి పీఠం సాధించిన కేసీఆర్ తొమ్మిదేళ్లలో అవినీతిని ఏరులై పారించి, ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారని విమర్శించారు. కుటుంబానికి పదవులు కట్టబెట్టి, ఉద్యమ ద్రోహులను నెత్తిన పెట్టుకున్నారన్నారు. ఇన్నాళ్లు దర్జాగా గడీల్లో ఉంటే, ఆయన ఎమ్మెల్యేలు బందీపోట్ల లెక్క ప్రజల మీద […]

విధాత: దమ్ముంటే సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల ట్వీట్టర్ వేదికగా సవాల్ చేశారు. ఉద్యమం సెంటిమెంట్‌తో తొలిసారి, తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో రెండోసారి ముఖ్యమంత్రి పీఠం సాధించిన కేసీఆర్ తొమ్మిదేళ్లలో అవినీతిని ఏరులై పారించి, ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారని విమర్శించారు.
కుటుంబానికి పదవులు కట్టబెట్టి, ఉద్యమ ద్రోహులను నెత్తిన పెట్టుకున్నారన్నారు. ఇన్నాళ్లు దర్జాగా గడీల్లో ఉంటే, ఆయన ఎమ్మెల్యేలు బందీపోట్ల లెక్క ప్రజల మీద పడి దోచుకున్నారన్నారు. కబ్జాలు, అవినీతికి పాల్పడ్డారని, ప్రశ్నించిన వారిని అణిచివేశారని, , ఎన్నికలొచ్చేసరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై జనం గుర్రుగా ఉన్నారని తెలుసుకుని కేసీఆర్ ఉలిక్కి పడుతున్నారన్నారు.
సిట్టింగ్‌లకే సీట్లు అంటు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఇంకోవైపు సర్వేలు చేయిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలను మారిస్తే తప్ప గట్టెక్కలేరని తెలుసుకున్నారన్నారు. మీది అవినీతి రహిత పాలన అయితే, ఎన్నికల హామీలకు న్యాయం చేస్తే మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలని, మళ్లీ గెలిచి మీ పాలనకు ఇది రెఫరెండం అని నిరూపించుకోవాలని షర్మిల ట్వీట్‌లో సవాల్ చేశారు.
ఉద్యమ సెంటిమెంట్ తో మొదటిసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన దొర గారు.. రెండోసారి తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో కుర్చీని కాపాడుకున్నారు. తొమ్మిదేండ్ల నుంచి అవినీతి ఏరులై పారించి, ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టాడు. కుటుంబానికి పదవులు కట్టబెట్టి, ఉద్యమ ద్రోహులను నెత్తిన పెట్టుకున్నాడు. ఇన్నాళ్లు…
— YS Sharmila (@realyssharmila) July 23, 2023