వరుని ఇంటికి హెలీకాప్టర్‌లో కొత్త జంట.. ఎక్కడంటే?
విధాత: పెండ్లి అనేది జీవితంలో ఒకే సారి జరిగేది. అందుకే ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో ప్రత్యేకత, విశిష్టత ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలో హంగులు, ఆర్బాటాలతో అంగరంగ వైభోగంగా పెండ్లి వేడుకను నిర్వహించుకొంటున్నారు. అంతటితోనే ఆగకుండా.. ఏదో రూపంలో ఎవరూ చూపని ఓ ప్రత్యేకతను చాటేందుకు ఆరాట పడటం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైంది. అలాంటిదే ఉత్తరప్రదేశ్‌లోని రూడ్కీ చావ్‌మండీ గ్రామంలో జరిగిన పెండ్లి వేడుక ఆ ప్రాంత ప్రజలందరినీ ఆశ్చర్య చకితులను చేసింది. సంజయ్‌కుమార్ […]

విధాత: పెండ్లి అనేది జీవితంలో ఒకే సారి జరిగేది. అందుకే ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో ప్రత్యేకత, విశిష్టత ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలో హంగులు, ఆర్బాటాలతో అంగరంగ వైభోగంగా పెండ్లి వేడుకను నిర్వహించుకొంటున్నారు. అంతటితోనే ఆగకుండా.. ఏదో రూపంలో ఎవరూ చూపని ఓ ప్రత్యేకతను చాటేందుకు ఆరాట పడటం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైంది.
అలాంటిదే ఉత్తరప్రదేశ్‌లోని రూడ్కీ చావ్‌మండీ గ్రామంలో జరిగిన పెండ్లి వేడుక ఆ ప్రాంత ప్రజలందరినీ ఆశ్చర్య చకితులను చేసింది. సంజయ్‌కుమార్ కుమారుడి వివాహం జిజ్నూర్ జిల్లాకు చెందిన నేహా ధీమాన్‌తో జరిగింది. వధూవరులు ఇద్దరూ హెలీకాప్టర్ ఎక్కి చావ్‌మండీ గ్రామానికి చేరుకున్నారు. అంతే.. చుట్టుముట్టు గ్రామాల ప్రజలంతా హెలికాప్టర్ చూడటానికి తండోప తండాలుగా తరలి వచ్చారు. పెళ్లి అంటే ఇలా జరరుగాలిరా అని అనుకోవడం కొసమెరుపు.
ఇలా పెండ్లి తంతును హంగు ఆర్బాటాలతో మాత్రమే కాకుండా ఓ ప్రత్యేకత ఉండేట్లు చేసుకోవటం ఈ మధ్య ఎక్కువైంది. ఒకరైతే.. ఏకంగా ఓ విమానాన్ని అద్దెకు తీసుకొని ఇరు కుటుంబాలూ ఆ విమానం ఎక్కి గాల్లోనే వధూ వరులిద్దర్ని ఒకటి చేశారు. మరో జంట అయితే.. బెలూన్లతో గాల్లోకి ఎగిరి దండలు మార్చుకొన్నారు. మరో జంట నీటి అడుగున ఉంగరాలు మార్చుకొని ఒకటయ్యారు. ఇలా పుర్రెకొక బుద్ధి. విశిష్టతకు ఒక వింత పోకడ.