మెదక్‌లో.. ఈ సంవత్సరమే వైద్య కళాశాల: మంత్రి హరీశ్‌రావు
అసెంబ్లీలో హామీ ఇచ్చిన మంత్రి హరీశ్‌రావు.. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావన తెచ్చిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి స్థలం కోసం కలెక్టర్‌కు ఆదేశాలు విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా కేంద్రంగా ఈ సంవత్సరమే మెడికల్ కళాశాలను మంజూరు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే పద్మా రెడ్డి మెడికల్ కళాశాల ఎర్పాటు విషయంలో అసెంబ్లీ […]

- అసెంబ్లీలో హామీ ఇచ్చిన మంత్రి హరీశ్‌రావు..
- ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావన తెచ్చిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
- స్థలం కోసం కలెక్టర్‌కు ఆదేశాలు
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా కేంద్రంగా ఈ సంవత్సరమే మెడికల్ కళాశాలను మంజూరు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సమాధానం ఇచ్చారు.
శుక్రవారం ఎమ్మెల్యే పద్మా రెడ్డి మెడికల్ కళాశాల ఎర్పాటు విషయంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. మెడికల్ కళాశాల ఎప్పుడు ఎర్పాటు చేస్తారు, నిధులు, ఎప్పుడు ఇస్తారని అడిగారు. దానికి మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ ఈ విద్యా సంవత్సరం నుంచే వైద్య కళాశాల ప్రారంభించ నున్నట్లు హామీ ఇచ్చారు.
ఇందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు.