IND VS AUS | భారత్‌ శుభారంభం..

విధాత: మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ముంబయి వేదికగా జరిగిన మొదటి వన్డేలో ఆస్ట్రేలియాపై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌ ఆరంభంలో తడబాటుకు గురైంది. కానీ కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజాల ద్వయం అద్భుతంగా ఆడారు. రాహుల్‌ (75 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీ సాధించి భారత్‌ను గెలిపించాడు. ఆయనకు అండగా జడేజా (45 […]

  • By: krs    latest    Mar 18, 2023 1:53 AM IST
IND VS AUS | భారత్‌ శుభారంభం..

విధాత: మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ముంబయి వేదికగా జరిగిన మొదటి వన్డేలో ఆస్ట్రేలియాపై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌ ఆరంభంలో తడబాటుకు గురైంది. కానీ కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజాల ద్వయం అద్భుతంగా ఆడారు. రాహుల్‌ (75 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీ సాధించి భారత్‌ను గెలిపించాడు.

ఆయనకు అండగా జడేజా (45 నాటౌట్‌)కీలక పరుగులు చేశాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే వైజాగ్‌ వేదికగా మార్చి 19న జరగనున్నది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించిన రవీంత్ర జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.