Vande Bharat Express | హైదరాబాద్‌కు మరో వందే భారత్ రైలు..! నాగ్‌పూర్ – సికింద్రాబాద్ మధ్య సెమీ హైస్పీడ్ రైలు..!!
Vande Bharat Express | ప్రస్తుతం భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే దాదాపు 16 మార్గాల్లో సెమీ హైస్పీడ్ రైళ్లు నడుస్తున్నాయి. వీటికి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తుండడంతో మరిన్ని మార్గాల్లో రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక చేస్తున్నది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ మార్గంలో సెమీ హైస్పీడ్ రైలును నడిపేందుకు కసరత్తు చేస్తున్నది. హైదరాబాద్ - నాగ్‌పూర్ మధ్య వాణిజ్యం భారీగా సాగుతుంటుంది. ఈ క్రమంలో ఎక్కువగా […]

Vande Bharat Express |
ప్రస్తుతం భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే దాదాపు 16 మార్గాల్లో సెమీ హైస్పీడ్ రైళ్లు నడుస్తున్నాయి. వీటికి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తుండడంతో మరిన్ని మార్గాల్లో రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక చేస్తున్నది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ మార్గంలో సెమీ హైస్పీడ్ రైలును నడిపేందుకు కసరత్తు చేస్తున్నది.
హైదరాబాద్ – నాగ్‌పూర్ మధ్య వాణిజ్యం భారీగా సాగుతుంటుంది. ఈ క్రమంలో ఎక్కువగా రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగుతుంటాయి. ప్రస్తుతం ఈ మార్గంలో 25 రైళ్లు నడుస్తున్నాయి. అయితే, రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లాంటి సూపర్ ఫాస్ట్ రైలు అందుబాటులో లేదు.
నాగ్‌పూర్ – సికింద్రాబాద్ మధ్య దూరం 581 కిలోమీటర్లు. ప్రస్తుతం ఉన్న రైళ్లలో ప్రయాణానికి దాదాపు 10 గంటలు సమయం పడుతున్నది. ఈ మార్గంలో కొత్తగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెడితే ప్రయాణ సమయాన్ని 10 గంటల నుంచి 6.30 గంటలకు తగ్గించనున్నది.
వందే భారత్ రూట్ ఇదే..!
నాగ్‌పూర్ – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణించే రూట్‌ను సైతం సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్, గోందియా, భండారా, చందాపూర్ జిల్లాల్లో వ్యాపారాలు భారీగా సాగుతుంటాయి. దీంతో పెద్ద ఎత్తున వ్యాపారాలు ప్రయాణిస్తుంటారు. ఈ మార్గంలో సూపర్ ఫాస్ట్ రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ఈ మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును తీసుకురానున్నట్లు సమాచారం.
ఇప్పటికే రైలు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. రైలు స్టాప్‌పేజ్‌లకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ.. సమాచారం మేరకు నాగ్‌పూర్ – సికింద్రాబాద్ మధ్య బల్హర్షా జంక్షన్, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, కాజీపేట జంక్షన్లలో ఆగనున్నది తెలుస్తున్నది. తిరుగు ప్రయాణంలో రైలు ఇదే నాలుగు స్టేషన్లలో ఆగనున్నది.
రైలు టైమింగ్స్ ఇవేనా..?
నాగ్‌పూర్ – సికింద్రాబాద్ రైలు టైంటేబుల్‌ను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. సికింద్రాబాద్ వందే భారత్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నాగ్‌పూర్ స్టేషన్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరనున్నది. మళ్లీ తిరిగి 1.30 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటలకు నాగ్‌పూర్‌కు చేరుకుంటుంది.
ఈ రైలు గంటకు 130 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక టికెట్ల విషయానికి వస్తే ఏసీ చైర్‌కార్ క్లాస్‌లో రూ.1515, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రూ.2835గా నిర్ణయించినట్లు సమాచారం. ఇంకా టికెట్ ధరలు మారే అవకాశాలున్నాయి.
అధికారికంగా టికెట్ల ధరలను నిర్ణయించాల్సి ఉంది. అయితే, రైలును ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయం తెలియరాలేదు. త్వరలోనే ట్రయల్ రన్ నిర్వహించి.. వందే భారత్ రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తున్నది.