తుర్కియే, సిరియాలకు భారత్‌ ఆపన్నహస్తం..!

విధాత, న్యూఢిల్లీ : భూకంపాలతో అల్లాడుతున్న తుర్కియే, సిరియాలకు భారత్‌ ఆపన్నహస్తం అందిస్తున్నది. నాలుగు సీ-17 గ్లోబల్‌ సైనిక రవాణా విమానాలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, అత్యాధునిక అన్వేషణ సామగ్రి, మొబైల్‌ ఆసుపత్రికి ఏర్పాటుకు అవసరమైన ఎక్విప్‌మెంట్‌, మందులను తరలించాయి. మంగళవారం ఉదయం రెండు సీ-17 విమానాలు తుర్కియే, సిరియాకు వెళ్లగా.. రాత్రి మరో రెండు విమానాలు బయలుదేరి వెళ్లాయని సైనిక అధికారులు తెలిపారు. వైద్య సామగ్రితో పాటు ఆరు టన్నుల సహాయక సామగ్రిని భారత్‌కు పంపింది. ఆగ్రాలోని […]

తుర్కియే, సిరియాలకు భారత్‌ ఆపన్నహస్తం..!

విధాత, న్యూఢిల్లీ : భూకంపాలతో అల్లాడుతున్న తుర్కియే, సిరియాలకు భారత్‌ ఆపన్నహస్తం అందిస్తున్నది. నాలుగు సీ-17 గ్లోబల్‌ సైనిక రవాణా విమానాలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, అత్యాధునిక అన్వేషణ సామగ్రి, మొబైల్‌ ఆసుపత్రికి ఏర్పాటుకు అవసరమైన ఎక్విప్‌మెంట్‌, మందులను తరలించాయి. మంగళవారం ఉదయం రెండు సీ-17 విమానాలు తుర్కియే, సిరియాకు వెళ్లగా.. రాత్రి మరో రెండు విమానాలు బయలుదేరి వెళ్లాయని సైనిక అధికారులు తెలిపారు.

వైద్య సామగ్రితో పాటు ఆరు టన్నుల సహాయక సామగ్రిని భారత్‌కు పంపింది. ఆగ్రాలోని ఆర్మ్‌ఫీల్డ్‌ ఆసుపత్రి నుంచి 99 మంది వైద్యుల బృందం తరలివెళ్లింది. ఈ బృందం 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నది. ఎక్స్‌రే యంత్రాలు, ఆక్సిజన్‌ ఉత్పత్తి యంత్రాలు, వెంటిలేటర్లు, కార్డియాక్‌ మానిటర్లతో పాటు అనుబంధ సామగ్రిని ఆర్మీ అధికారులు తెలిపారు. తుర్కియే, సిరియాలో సహాయక చర్యలను కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తున్నది. వరుస భూకంపాలతో తుర్కియే, సిరియాలో దాదాపు 8వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌ ఆపన్నహస్తం అందించేందుకు ముందువచ్చింది.