INDIA | ‘ఇండియా’దే అధికారం.. లోక్‌పోల్‌ ట్విట్టర్‌ పోల్‌లో 84% మద్దతు

INDIA | ఎన్డీయే మళ్లీ వస్తుందన్న 13శాతం మంది న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించేది ఇండియా కూటమేనని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. లోక్‌పోల్‌ అనే సంస్థ 2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? అంటూ ఒక పోల్‌ నిర్వహిస్తున్నది. ఈ పోల్‌లో పాల్గొనేందుకు మంగళవారం అర్ధరాత్రి వరకూ అవకాశం ఉన్నది. అయితే.. ఇప్పటి వరకూ 59వేల మంది ఓటింగ్‌లో పాల్గొనగా.. అందులో 83.9 శాతం మంది ఇండియా కూటమి అధికారంలో […]

  • By: krs    latest    Jul 31, 2023 5:02 PM IST
INDIA | ‘ఇండియా’దే అధికారం.. లోక్‌పోల్‌ ట్విట్టర్‌ పోల్‌లో 84% మద్దతు

INDIA |

ఎన్డీయే మళ్లీ వస్తుందన్న 13శాతం మంది

న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించేది ఇండియా కూటమేనని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. లోక్‌పోల్‌ అనే సంస్థ 2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? అంటూ ఒక పోల్‌ నిర్వహిస్తున్నది.

ఈ పోల్‌లో పాల్గొనేందుకు మంగళవారం అర్ధరాత్రి వరకూ అవకాశం ఉన్నది. అయితే.. ఇప్పటి వరకూ 59వేల మంది ఓటింగ్‌లో పాల్గొనగా.. అందులో 83.9 శాతం మంది ఇండియా కూటమి అధికారంలో చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని 12.8 శాతం మంది అభిప్రాయ పడ్డారు.

ఇతరులు వస్తారని ఒకశాతం మంది పేర్కొనగా.. ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేమని 2.3శాతం మంది తెలిపారు. ఈ పోస్టుకు ఇప్పటి వరకూ 1.95 లక్షల వ్యూస్‌ వచ్చాయి. దీనిని 2450 మంది రీట్వీట్‌ చేశారు. ఈ పోస్టుపై పలువురు ఆసక్తికరంగా స్పందించారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీ కూటమి 140 స్థానాలకు పరిమితమవుతుందని ఒక యూజర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఒక యూజర్‌ మాత్రం ఇది ఇండియా కూటమి నిర్వహించిన పోల్‌ అని ఆరోపించారు. డిసెంబర్‌ నాటికి ఇండియా కూటమిలో కాంగ్రెస్‌, కొన్ని చిన్న పార్టీలు తప్ప ఏమీ మిగలవని జోస్యం చెప్పారు.