PM Modi | ఇండియన్ ముజాహిద్దీన్‌లోనూ ఇండియా ఉన్నది: ప్రధాని మోదీ
PM Modi బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీలోనూ అదే.. ఉగ్రసంస్థలతో 'ఇండియా'ను పోల్చిన మోదీ నిరసన తెలపడమే ప్రతిపక్షాల పని అని ఆగ్రహం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఫైర్ విధాత: విపక్ష కూటమి - ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A)పై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. విపక్ష ఇండియాను ఉగ్రవాద సంస్థలతో పోల్చారు. 'ఇండియన్ ముజాహిదీన్', 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)' వంటి ఉగ్రవాద సంస్థల్లో కూడా […]

PM Modi
- బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీలోనూ అదే..
- ఉగ్రసంస్థలతో ‘ఇండియా’ను పోల్చిన మోదీ
- నిరసన తెలపడమే ప్రతిపక్షాల పని అని ఆగ్రహం
- బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఫైర్
విధాత: విపక్ష కూటమి – ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A)పై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. విపక్ష ఇండియాను ఉగ్రవాద సంస్థలతో పోల్చారు. ‘ఇండియన్ ముజాహిదీన్’, ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)’ వంటి ఉగ్రవాద సంస్థల్లో కూడా ఇండియా పేరు ఉన్నదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. బ్రిటిషర్లు వచ్చిఈస్టిండియా కంపెనీ అని పేరు పెట్టుకున్నట్లే, విపక్షం కూడా ఇండియా పేరుతో కూటమి కట్టిందని ఎద్దేవా చేశారు.
మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ ప్రకటన, మణిపూర్ అంశంపై దీర్ఘకాల చర్చకు ప్రతిపక్షాల డిమాండ్ నేపథ్యంలో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.
Visuals of PM Modi attending the BJP parliamentary party meeting earlier today. pic.twitter.com/mUHYtAsuXy
— Press Trust of India (@PTI_News) July 25, 2023
ఈ సమవేశంలో మోదీ మాట్లాడుతూ.. విపక్షాలు పూర్తిగా దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని విమర్శించారు. నిరసన తెలపడమే ప్రతిపక్షాల పని అని మండిపడ్డారు. వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదని, మన పనిపై మనం దృష్టిపెట్టాలని పార్టీ నేతలకు మోదీ సూచించారు.
మణిపూర్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సోమవారం రాత్రంతా పార్లమెంటు ఆవరణలో మంగళవారం ఉదయం వరకు నిరసన చేపట్టారు. మణిపూర్ వైరల్ వీడియోపై చర్చ కోసం ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటు లోపల దానిపై ప్రధాని మోదీ ప్రకటనను కోరడంతో ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడింది. దాంతో మంగళవారం పలుమార్లు ఉభయసభలు వాయిదా పడ్డాయి.