అమెరికాలో భారతీయులు 1%.. పన్నులు 6%
భారతీయుల జీవన విధానం ఆదర్శనీయం.. ప్రశాంతతకు మారుపేరని మెచ్చుకోలు.. నిరంతరం శ్రమించే తత్త్వంతోనే: అమెరికా ప్రతినిధి రిచ్‌మెక్ కార్మిక్ విధాత: అమెరికాలో భారతీయుల స్థితిగతులు, ప్రవర్తనలపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి భారతీయులపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాలో భారతీయులు ఒక శాతం మాత్రమే ఉన్నా, పన్నుల్లో ఆరు శాతం వాటా ఉంటున్నదని తెలిపారు. భారతీయుల జీవన సరళి, కుటుంబ జీవనం ఆదర్శనీయమైనదని రిచ్‌మెక్ కార్మిక్ కొనియాడారు. వారు తీవ్ర […]

- భారతీయుల జీవన విధానం ఆదర్శనీయం..
- ప్రశాంతతకు మారుపేరని మెచ్చుకోలు..
- నిరంతరం శ్రమించే తత్త్వంతోనే: అమెరికా ప్రతినిధి రిచ్‌మెక్ కార్మిక్
విధాత: అమెరికాలో భారతీయుల స్థితిగతులు, ప్రవర్తనలపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి భారతీయులపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాలో భారతీయులు ఒక శాతం మాత్రమే ఉన్నా, పన్నుల్లో ఆరు శాతం వాటా ఉంటున్నదని తెలిపారు.
భారతీయుల జీవన సరళి, కుటుంబ జీవనం ఆదర్శనీయమైనదని రిచ్‌మెక్ కార్మిక్ కొనియాడారు. వారు తీవ్ర వత్తిడిలకు లోనై, ఎక్కువ డోస్‌లతో అత్యవసర వైద్యం అవసరమైన స్థితిలో భారతీయులు ఎప్పుడూ ఉండరన్నారు. అత్యంత ఉత్పాదకత, శ్రమించి పనిచేసే తత్వంతో భారతీయులు ప్రశాంతతకు మారుపేరుగా ఉంటారని మెచ్చుకొన్నారు.
జార్జియా నుంచి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన రిపబ్లికన్ అభ్యర్థి రిచ్ మెక్‌కార్మిక్ భారతీయుల మద్దతుతోనే డిమోక్రటిక్ అభ్యర్థిని ఓడించారు. జార్జియాలో లక్ష మందికి పైగా భారతీయులుంటారు. భారతీయులు అమెరికా అభివృద్ధి, పురోగమనంలో భాగస్వాములుగా ఉన్నారనీ, వారి ఇమ్మిగ్రేషన్ సమస్యల పరిష్కారం కోసం కృషిచేయనున్నట్లు తెలిపారు.
భారతీయులు ఎవరైనా అమెరికాలో స్థిరపడాలని అనుకునే వారికి సులభ పద్ధతిలో అధికారిక చట్టపర మద్ధతు ఉండేట్లు చర్యలు తీసుకోనున్నట్లు మెక్ కార్మిక్ తెలియజేశారు.