Indonesia | జిమ్‌లో 210 కేజీల బ‌రువు ఎత్తే ప్ర‌య‌త్నం.. మెడ విరిగి బాడీబిల్డర్‌ మృతి

Indonesia విధాత‌: ఇండోనేసియా (Indonesia) లో ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌ (Fitness Influencer) గా పేరు తెచ్చుకున్న 33 ఏళ్ల యువ‌కుడు జిమ్ చేస్తూనే ప్రాణాలు కోల్పోవ‌డం స్థానికంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. జ‌స్టిన్ విక్కీ అనే ఈ యువ‌కుడు బాలి (Bali) లోని జిమ్ లో ప‌నిచేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 15న జిమ్‌లో బార్‌బెల్‌ని మెడ‌పై పెట్టుకుని స్క్వాట్స్ చేస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు న్యూస్ ఏసియా క‌థ‌నం వెల్ల‌డించింది. సోష‌ల్ మీడియాలో ఈ […]

  • By: Somu    latest    Jul 22, 2023 11:22 AM IST
Indonesia | జిమ్‌లో 210 కేజీల బ‌రువు ఎత్తే ప్ర‌య‌త్నం.. మెడ విరిగి బాడీబిల్డర్‌ మృతి

Indonesia

విధాత‌: ఇండోనేసియా (Indonesia) లో ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌ (Fitness Influencer) గా పేరు తెచ్చుకున్న 33 ఏళ్ల యువ‌కుడు జిమ్ చేస్తూనే ప్రాణాలు కోల్పోవ‌డం స్థానికంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. జ‌స్టిన్ విక్కీ అనే ఈ యువ‌కుడు బాలి (Bali) లోని జిమ్ లో ప‌నిచేస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలో ఈ నెల 15న జిమ్‌లో బార్‌బెల్‌ని మెడ‌పై పెట్టుకుని స్క్వాట్స్ చేస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు న్యూస్ ఏసియా క‌థ‌నం వెల్ల‌డించింది. సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్ అయింది. అందులో విక్కీ బార్‌బెల్‌ని భుజాల‌పై పెట్టుకుని స్క్వాట్లు తీయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. దానిని ప‌ట్టుకుని నిల‌బ‌డ‌టానికి ఇబ్బంది ప‌డిన‌ట్లు వీడియోలో క‌నిపించింది.

అదే క్ష‌ణంలో ఆ బ‌రువును మోయ‌ లేక‌పోవ‌డంతో అది స‌రాస‌రిన మెడ మీద ప‌డ‌టంతో మెడ విరిగిపోయి.. విక్కీ నేల‌కూలిపోయాడు. విక్కీ ట్రైన‌ర్ కూడా అత‌డితో ఉన్న‌ప్ప‌టికీ ఈ ప్ర‌మాదాన్ని నిలువ‌రించ‌ లేక‌పోయాడు.

ప్ర‌త్య‌క్ష సాక్షుల ప్ర‌కారం.. విక్కీ ప్ర‌మాద స‌మ‌యంలో సుమారు 210 కేజీల బార్‌బెల్‌ (Barbell)ను మోయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. త‌న‌ను హుటాహుటిన ఆసుప‌త్రికి తీసుకెళ్లిన‌ప్ప‌టికీ.. అత్య‌వ‌స‌ర విభాగంలో చికిత్స తీసుకుంటూ కొన్ని నిమిషాల‌కే మ‌ర‌ణించాడు.

విక్కీ మృతిపై ఇండోనేసియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ఉత్సాహానికి, అకుంఠిత దీక్ష‌కు, ప‌ట్టుద‌ల‌కు విక్కీ ఒక చుక్కాని లాంటి వాడు అని అత‌డు ప‌ని చేస్తున్న ఆ పార‌డైజ్ బాలి జిమ్ ట్వీట్ చేసింది