‘ఇప్పటం’ పవన్‌కు పెద్ద ఇరకాటం!
లక్ష ఆర్థికసాయం ఇస్తారా!! విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని భావించిన జనసేనా పవన్ కళ్యాణ్ కు పెద్ద తలకాయనొప్పిగా తయారైంది. వాస్తవానికి ఆ గ్రామాన్ని టార్గెట్‌గా చేసుకున్న ప్రభుత్వం వాళ్ల ఇళ్లను కూల్చివేస్తోందని గతంలో పవన్ ఆరోపించారు. అంతేకాకుండా ఈ అంశం మీద భారీగా విమర్శలు చేసిన పవన్ ఆ గ్రామస్తులు కొందరికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేసేందుకు ఈనెల […]

- లక్ష ఆర్థికసాయం ఇస్తారా!!
విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని భావించిన జనసేనా పవన్ కళ్యాణ్ కు పెద్ద తలకాయనొప్పిగా తయారైంది.
వాస్తవానికి ఆ గ్రామాన్ని టార్గెట్‌గా చేసుకున్న ప్రభుత్వం వాళ్ల ఇళ్లను కూల్చివేస్తోందని గతంలో పవన్ ఆరోపించారు. అంతేకాకుండా ఈ అంశం మీద భారీగా విమర్శలు చేసిన పవన్ ఆ గ్రామస్తులు కొందరికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేసేందుకు ఈనెల 27న డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ తరుణంలో ఆయనకు పెద్ద చిక్కొచ్చి పడింది.
ఇప్పటం గ్రామస్తులు కోర్టును మోసగించినట్లు భావించిన హైకోర్టు పిటిషనర్లు 14 మందికి రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. గ్రామస్తులకు నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి గోడలు కూలుస్తున్నారంటూ పవన్ విమర్శలు గుప్పించారు. వాస్తవానికి అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అధికారులు నోటీసులు ఇచ్చినా.. ఇవ్వలేదని కోర్టుకు అబద్ధం చెప్పి పిటిషనర్లు స్టే తెచ్చుకున్నారు.
కాగా షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లు కూల్చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన స్థానికులు చివరకు వాస్తవాన్ని హైకోర్టుకు నివేదించారు. అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారని ఇళ్ల యజమానుల తరఫు న్యాయవాది హైకోర్టు ముందు అంగీకరించారు. దీంతో వారిపై హైకోర్టు మండిపడింది.
షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ ఇవ్వలేదంటూ కోర్టుకొచ్చి కూల్చివేతలపై స్టే పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని అసహనం వ్యక్తం చేసింది. క్రిమినల్ కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరించాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్లు స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
ఇదిలా ఉండగా ఇప్పటంలో పర్యటించి బాధితులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ఇవ్వడానికి ఈ నెల 27న. డేట్ ఫిక్స్ చేశారు పవన్. అయితే ఇప్పుడు పవన్ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటం వెళ్లి వారికి రూ.లక్ష చొప్పున సాయం చేస్తారా.. లేదా కోర్టు తీర్పు నేపథ్యంలో వెనకడుగు వేస్తారో చూడాలి. మొత్తానికి కోర్టు తీర్పుతో వైసీపీకి నైతిక బలం వచ్చినట్లు అయింది.