Israel-Iran War: తగ్గెదేలే..బంకర్ల నుంచి ఆయుధాలు బయటకు తీస్తున్న ఇరాన్ !

Israel-Iran War: తగ్గెదేలే..బంకర్ల నుంచి ఆయుధాలు బయటకు తీస్తున్న ఇరాన్ !

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్దంలో అమెరికా సహా పలు అగ్రదేశాలు ఇరాన్ కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ కు మద్ధతుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇరాన్ సుప్రీం కమాండర్ ఖోమైనీని లొంగిపోవాల్సిందేనని..ఆయన టార్గెల్ లోనే ఉన్నారంటూ హెచ్చరించాడు. ఇరాన్ అణు, ఆయుధ స్థావరాలపై దాడులు చేస్తామంటు ఇజ్రాయెల్ బెదిరిస్తుంది. అయితే ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటూ యుద్దంలో ముందుకెలుతుంది. ఇన్నాళ్లుగా తాము సమకూర్చుకున్న ఆయధ సంపత్తిని బయటకు తీస్తుంది. తమ రహస్య బంకర్లలో దాచిన ఆయుధాలు మిస్సైల్స్, రాకెట్లను యుద్ద క్షేత్రానికి తరలిస్తుంది. ఇందుకు సంబంధించి ఓ వీడియో వైరల్ గా మారింది. మట్టి బంకర్ గా కనిపిస్తున్నప్రాంతం నుంచి మిస్సైల్స్ ను తరలిస్తున్న దృశ్యాల వీడియో వైరల్ అవుతోంది.

చీమల దండులా బారులుగా మిస్సైల్స్ తో బంకర్ నుంచి బయటకు వస్తున్న వాహన శ్రేణి ఇరాన్ ఆయుధ బలగాన్ని చాటింది. ఇరాన్ దూకుడు చూస్తుంటే ఇజ్రాయెల్ తో యుద్దంలో ఎవరెటువైపు ఉన్నా తాము మాత్రం వెనక్కి తగ్గెదేలా అన్నట్లుగా ఉందంటున్నారు నిపుణులు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇందులో ఇరాన్ ఆయుధ బలం ఇరాన్ మూడున్నర సంవత్సరాలు యుద్ధం చేయగల సామర్థ్యాన్ని..ఆత్మరక్షణకు పూర్తిగా సిద్ధంగా ఉందన్న అంశాలను చాటుతుందని..అమెరికా..ఇజ్రాయెల్ దీనిని హెచ్చరికగా కాకుండా శాంతి దిశగా ఆలోచనగా తీసుకోవాలంటున్నారు.