CM KCR | 600 వాహనాల కాన్వాయ్‌తో.. KCR సోలాపూర్ ప‌ర్య‌ట‌న‌! ప్ర‌జా ధ‌నంతో పార్టీ కార్య‌క్ర‌మాలా?.. అంటూ విమ‌ర్శ‌ల వెల్లువ

CM KCR | విధాత‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్ర వెళ్లారు. ప్రగతి భవన్‌లో సోమ‌వారం ఉద‌యం బయల్దేరిన బ‌స్సులో కేసీఆర్ తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. బస్సు వెనుక భారీ దాదాపు 600 వాహనాల కాన్వాయ్‌తో రోడ్డు మార్గంలో రెండురోజుల మ‌హ‌రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు. సోలాపూర్‌ వెళ్లే మార్గంలో ధారాశివ్‌ జిల్లా ఒమర్గా వద్ద లంచ్‌ చేసి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు మళ్లీ బయల్దేరి రాత్రికి […]

  • By: Somu    latest    Jun 26, 2023 12:59 AM IST
CM KCR | 600 వాహనాల కాన్వాయ్‌తో.. KCR సోలాపూర్ ప‌ర్య‌ట‌న‌! ప్ర‌జా ధ‌నంతో పార్టీ కార్య‌క్ర‌మాలా?.. అంటూ విమ‌ర్శ‌ల వెల్లువ

CM KCR |

విధాత‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్ర వెళ్లారు. ప్రగతి భవన్‌లో సోమ‌వారం ఉద‌యం బయల్దేరిన బ‌స్సులో కేసీఆర్ తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. బస్సు వెనుక భారీ దాదాపు 600 వాహనాల కాన్వాయ్‌తో రోడ్డు మార్గంలో రెండురోజుల మ‌హ‌రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు.

సోలాపూర్‌ వెళ్లే మార్గంలో ధారాశివ్‌ జిల్లా ఒమర్గా వద్ద లంచ్‌ చేసి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు మళ్లీ బయల్దేరి రాత్రికి సోలాపూర్ లో బస చేస్తారు. మంగళవారం ఉదయం పండరీపురం చేరుకుని ద‌ర్శ‌నం చేసుకోనున్నారు. ఈ ప‌ర్య‌ట‌న ప‌ట్ల నెటిజ‌న్లతోపాటు, రాజ‌కీయ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌జాధ‌నంతో అధికారిక కార్య‌క్ర‌మాల‌కు వెళ్లిన‌ట్లు పార్టీ కార్య‌క్ర‌మాలు వెళ్ల‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అని ప్ర‌శ్నించారు.

“సీఎం గారు, మీ దిక్కుమాలిన దేశ రాజకీయాల కోసం తెలంగాణ డబ్బును ఎంత నిస్సిగ్గుగా వాడుతున్నారో అసలు సోయ ఉన్నదా మీకు? మహారాష్ట్రలో అచ్చోసిన ఆంబోతుల్లాగా తిరుగుతున్న BRS ఎమ్యెల్యేలు, ఆ ఖర్చులను తెలంగాణ ఖాతాలో జమ చేస్తరా? KCR తిరిగే TSRTC బస్సు మొదలుకొని మంత్రులు, ఎమ్యెల్యేలు తెలంగాణ సర్కారీ బండ్లు మహారాష్ట్రలో తిప్పుతారా? ఆ బస్సులు, బళ్ళు తెలంగాణ ఆస్తులు, తెలంగాణ ప్రజల కష్టార్జితం, వారి మీద వేసే పన్నులతో కొన్నవి. ఏ హక్కు, నైతికతతో వాటిని మహా రాష్ట్రలో నడుపుతారు ఈ దుర్మార్గ భారాస నాయకులు?” అంటూ వైఎస్ ష‌ర్మిల ట్వీట్ చేశారు.

“భారాసా జలగల్లారా, ఇంకెంత తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి బలుస్తారు. సిగ్గుంటే, కొంచమైనా నీతి అనేది మీలో ఇంకా మిగిలి ఉంటే, సరిహద్దు దాటాక తెలంగాణ బండ్లను, ఆస్తులను అక్కికక్కడే వదిలి, మహారాష్ట్ర బళ్లను వాడండి. మీ చెత్త రాజకీయాలను మహారాష్ట్ర ప్రజలు నిరాకరించారు, థూ అని మొహం మీద ఊయటానికి రెడీగా ఉన్నారు. మరి ఈ పరిస్థితిల్లో మీకు ఈ డ్రామాలు అవసరమా? మరికొన్ని దినాలలో మీ సర్కారుకు తెలంగాణ ప్రజానీకం బొందపెట్టపోతోంది. ఓటుతో మీ ఆటలు కట్టించడానికి ప్రజలు రెడీ” అంటూ ష‌ర్మిల‌ శాప‌నార్థాలు పెట్టారు.