తల్లిని నరికి చంపిన తనయుడు.. మొండెం నుంచి త‌ల వేరు

తల్లిని నరికి చంపిన తనయుడు జనగామ జిల్లాలో దారుణం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రోజురోజుకు మానవ సంబంధాలు మృగ్యమై.. అనుబంధాలు, ఆప్యాయతలు సన్నగిల్లుతున్నాయి. వాటి స్థానంలో కక్షలు, కార్పన్యాలు చోటు చేసుకుంటున్నాయి. చిన్న చిన్న విషయాల కోసం రక్త సంబంధీకుల మధ్య గొడవలు తలెత్తి రక్తమోడుతున్నారు. అలాంటి అలాంటి దుర్మార్గమైన ఘటనే ఇది. న‌వ మాసాలు మోసి క‌ని పెంచిన ఓ త‌ల్లి ప‌ట్ల ఓ కుమారుడు క్రూర మృగంలా ప్ర‌వ‌ర్తించాడు. ఏ మాత్రం క‌నిక‌రించ‌కుండా.. […]

తల్లిని నరికి చంపిన తనయుడు.. మొండెం నుంచి త‌ల వేరు
  • తల్లిని నరికి చంపిన తనయుడు
  • జనగామ జిల్లాలో దారుణం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రోజురోజుకు మానవ సంబంధాలు మృగ్యమై.. అనుబంధాలు, ఆప్యాయతలు సన్నగిల్లుతున్నాయి. వాటి స్థానంలో కక్షలు, కార్పన్యాలు చోటు చేసుకుంటున్నాయి. చిన్న చిన్న విషయాల కోసం రక్త సంబంధీకుల మధ్య గొడవలు తలెత్తి రక్తమోడుతున్నారు. అలాంటి అలాంటి దుర్మార్గమైన ఘటనే ఇది.

న‌వ మాసాలు మోసి క‌ని పెంచిన ఓ త‌ల్లి ప‌ట్ల ఓ కుమారుడు క్రూర మృగంలా ప్ర‌వ‌ర్తించాడు. ఏ మాత్రం క‌నిక‌రించ‌కుండా.. తల్లిని క‌త్తితో నరికేశాడు. అంత‌టితో ఆగ‌కుండా మొండెం నుంచి త‌ల‌ను వేరు చేసి.. గ్రామంలో భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టించాడు. ఈ దారుణ ఘ‌ట‌న జ‌న‌గామ జిల్లా ప‌రిధిలోని మ‌రిగ‌డి గ్రామంలో గురువారం ఉద‌యం వెలుగు చూసింది.

ఆస్తి కోసం తల్లిని నరికి చంపిన కొడుకు

మ‌రిగ‌డి గ్రామానికి చెందిన కూరాకుల ర‌మ‌ణ‌మ్మ‌(60) త‌న కుమారుడు క‌న్న‌ప్ప‌తో క‌లిసి ఉంటోంది. అయితే ఆస్తి విష‌యంలో త‌ల్లీకుమారుడి మ‌ధ్య గ‌త కొద్ది రోజుల నుంచి గొడ‌వ‌లు చోటు చేసుకుంటున్నాయి. ఆస్తి త‌న పేర రాయాల‌ని క‌న్నప్ప త‌న త‌ల్లిపై తీవ్ర ఒత్తిడి చేశాడు. తల్లి అంగీక‌రించ‌క‌ పోవ‌డంతో.. బుధ‌వారం రాత్రి కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

క్ష‌ణికావేశంలో త‌ల్లిపై క‌త్తితో దాడి చేసి చంపాడు. ఆ త‌ర్వాత మొండెం నుంచి త‌ల‌ను వేరు చేశాడు క‌న్న‌ప్ప‌. ర‌మ‌ణ‌మ్మ మృత‌దేహాన్ని చూసిన స్థానికులు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. అయితే నిందితుడు క‌న్న‌ప్ప స్థానిక పోలీసు స్టేష‌న్‌లో లొంగిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.