బంగారం స్వ‌చ్ఛ‌త‌ను తెలుసుకోవ‌డం ఎలా?

విధాత‌: బంగారం కొనేట‌ప్పుడు మ‌న‌లో చాలామంది ధ‌రల గురించే ఆలోచిస్తాం.. ఆరాతీస్తాం. కానీ ఆ పుత్త‌డి స్వ‌చ్ఛ‌త‌ను పెద్ద‌గా ప‌రిశీలించం. అయితే గోల్డ్ ప్యూరిటీ కూడా చాలాచాలా ముఖ్య‌మైన అంశ‌మేన‌ని తెలుసుకోవాలి. ప‌సిడికి ఉన్న స్వ‌చ్ఛతనుబ‌ట్టే ధ‌ర‌ల్లో మార్పులుంటాయిమ‌రి. అందుకే కొనేట‌ప్పుడు ప్యూరిటీని కూడా చూడాలి. బంగారం స్వ‌చ్ఛ‌త‌ను క్యారెట్ల‌లో కొలుస్తారు. 24 క్యారెట్ అంటే అత్యంత స్వ‌చ్ఛ‌మైన ప‌సిడి అని అర్థం. దీన్నే 999 లేదా 99.9 స్వ‌చ్ఛ‌త‌గా కూడా పిలుస్తారు. ఇక‌ బిస్క‌ట్లు, నాణేల […]

  • By: Somu    latest    Feb 14, 2023 12:18 AM IST
బంగారం స్వ‌చ్ఛ‌త‌ను తెలుసుకోవ‌డం ఎలా?

విధాత‌: బంగారం కొనేట‌ప్పుడు మ‌న‌లో చాలామంది ధ‌రల గురించే ఆలోచిస్తాం.. ఆరాతీస్తాం. కానీ ఆ పుత్త‌డి స్వ‌చ్ఛ‌త‌ను పెద్ద‌గా ప‌రిశీలించం. అయితే గోల్డ్ ప్యూరిటీ కూడా చాలాచాలా ముఖ్య‌మైన అంశ‌మేన‌ని తెలుసుకోవాలి. ప‌సిడికి ఉన్న స్వ‌చ్ఛతనుబ‌ట్టే ధ‌ర‌ల్లో మార్పులుంటాయిమ‌రి. అందుకే కొనేట‌ప్పుడు ప్యూరిటీని కూడా చూడాలి.

బంగారం స్వ‌చ్ఛ‌త‌ను క్యారెట్ల‌లో కొలుస్తారు. 24 క్యారెట్ అంటే అత్యంత స్వ‌చ్ఛ‌మైన ప‌సిడి అని అర్థం. దీన్నే 999 లేదా 99.9 స్వ‌చ్ఛ‌త‌గా కూడా పిలుస్తారు. ఇక‌ బిస్క‌ట్లు, నాణేల రూపంలోనే ఈ స్వ‌చ్ఛ‌మైన ప‌సిడి ల‌భిస్తుంది. దుకాణాల్లో మ‌నం కొనే ఆభ‌ర‌ణాల‌న్నీ 22 క్యారెట్ల నుంచి 18 క్యారెట్ల మ‌ధ్య స్వ‌చ్ఛ‌త‌ను క‌లిగి ఉంటాయి. ఎందుకంటే వీటిల్లో ఇత‌ర లోహాలు క‌లుస్తాయి.

ఇక హాల్‌మార్క్ ఉన్న న‌గ‌ల‌నే ఎప్పుడూ కొనాలి. కేంద్ర ప్ర‌భుత్వం కూడా దీన్ని త‌ప్ప‌నిస‌రి చేసింది. హాల్‌మార్క్ గోల్డ్ జ్యుయెల్ల‌రీని బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ (బీఐఎస్‌) స‌ర్టిఫై చేస్తుంది. కొనే ఆభ‌ర‌ణంపై బీఐఎస్ లోగో ఉంటుంది. దీన్ని కొనుగోలుదారులు క‌చ్ఛితంగా గ‌మ‌నించాలి.

అలాగే 6 అంకెల‌తో ఓ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేష‌న్ (హెచ్‌యూఐడీ) ఆభ‌ర‌ణంపై ఉంటుంది. ప్యూరిటీకి సంబంధించి 22 క్యారెట్ లేదా 18 క్యారెట్ అని కూడా న‌గ‌పై ఉంటుంది. ఇప్ప‌టికే మ‌న వ‌ద్ద ఉన్న పాత బంగారు న‌గ‌ల ప్యూరిటీని కూడా బీఐఎస్ కేంద్రాల్లో తెలుసుకోవ‌చ్చు. హాల్‌మార్కింగ్ చార్జీలు న‌గ బ‌రువుతో సంబంధం లేకుండా ఒక్కో న‌గ‌కు రూ.35 (జీఎస్టీ అద‌నం) చొప్పున తీసుకుంటారు.