Sri Chaitanya: శ్రీచైతన్య విద్యాసంస్ధలపై ఐటీ సోదాలలో కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం

శ్రీచైతన్య డైరెక్టర్ యలమంచిలి శ్రీధర్ ఇంట్లో సోదాలు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. శ్రీధర్ నివాసంలో పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.

Sri Chaitanya: శ్రీచైతన్య విద్యాసంస్ధలపై ఐటీ సోదాలలో కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం

Sri Chaitanya: శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. శ్రీచైతన్య డైరెక్టర్ యలమంచిలి శ్రీధర్ ఇంట్లో సోదాలు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. శ్రీధర్ నివాసంలో పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. 2020లోనూ శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ దాడులు నిర్వహించి రూ. 11 కోట్లు స్వాధీనం చేసుకుంది. ప్రస్తుత దాడుల్లో రూ.5కోట్ల కు పైగా స్వాధీనం చేసుకున్నారు.

శ్రీ చైతన్య విద్యాసంస్థల టాక్స్ చెల్లింపులపై ఐటీ ఆరా తీస్తుంది. లావాదేవీల సాఫ్ట్ వేర్ ను అధికారులు పరిశీలిస్తున్నారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీచైతన్య యాజమాన్యం పన్నులు కట్టడం లేదనే ఆరోపణలున్నాయి. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని టాక్స్ చెల్లించకుండా ఎగవేతకు పాల్పడుతున్నారని.. విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసుకొని లావాదేవీలు నిర్వహిస్తూ..ప్రభుత్వానికి కట్టే టాక్స్ కొరకు మరొక సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేసుకున్నారని గుర్తించారు.

ప్రత్యేక సాప్ట్ వేర్ రూపొందించి ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం ఐటీశాఖకు కోట్లాది రూపాయయలు ఎగబెట్టినట్టు సమాచారం.తెలుగు రాష్ట్రాలతో బాటు చెన్నయ్, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ నగరాల్లో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత దాడుల్లో ఐటీ శాఖ అధికారులు బ్యాంక్ లావాదేవీలు, ఫీజుల చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయల విలువైన డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు సమాచారం. తనిఖీలు పూర్తయిన తర్వాత, అధికారికంగా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.