Jagadish Reddy: పీక్ ఆవర్స్లో.. అదనపు విద్యుత్ చార్జీలపై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపాటు
విధాత: పీక్ లోడ్ ఆవర్స్లో ప్రతి యూనిట్కి 20 శాతం అదనపు చార్జీ వసూలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశ ప్రజలను విద్యుత్ వినియోగానికి దూరం చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలో భాగమే పీక హవర్స్అ అదనపు విద్యుత్ చార్జీల వసూళ్లంటూ ఆరోపించారు. కార్పొరేట్లకు లాభం కోసమే మోడీ పరిపాలన సాగుతుందని మరోసారి తేటతెల్లమైందన్నారు. పేద ప్రజలకు సబ్సిడీలు ఎత్తేసే […]

విధాత: పీక్ లోడ్ ఆవర్స్లో ప్రతి యూనిట్కి 20 శాతం అదనపు చార్జీ వసూలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశ ప్రజలను విద్యుత్ వినియోగానికి దూరం చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలో భాగమే పీక హవర్స్అ అదనపు విద్యుత్ చార్జీల వసూళ్లంటూ ఆరోపించారు. కార్పొరేట్లకు లాభం కోసమే మోడీ పరిపాలన సాగుతుందని మరోసారి తేటతెల్లమైందన్నారు.
పేద ప్రజలకు సబ్సిడీలు ఎత్తేసే కుట్ర జరుగుతుందని, గతంలోనూ తెలంగాణ విద్యుత్ పై కుట్రలు చేసి రుణాలు రాకుండా మోడీ అడ్డుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీల భారాన్ని భరించి నాణ్యమైన విద్యుత్ ఇస్తుంటే కేంద్రం ప్రజలపై భారం వేస్తుందన్నారు. కేంద్రం పేదల పై భారం వేయడాన్ని అడ్డుకుంటామన్నారు. మోడీ దుర్మార్గపు పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడాలన్నారు.
పీక్ లోడ్ అవర్స్ (విద్యుత్ డిమాండ్ అధికంగా వున్న సమయం )లో ప్రతి యూనిట్ కి 20 శాతం అదనపు చార్జీల వసూలు చేయాలన్న కేంద్ర నిర్ణయం పై మండిపడ్డ తెలంగాణ విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి . pic.twitter.com/wWmdZu7oIY
— Jagadish Reddy G (@jagadishBRS) March 26, 2023