Jailer | జైలర్ సినిమా.. నటీనటుల రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!
Jailer | దాదాపు మూడేళ్ల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రంతో ఎంత పెద్ద హిట్ కొట్టారో మనం చూశాం. ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. నాలుగు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఇప్పటికీ దూసుకుపోతుంది. ఒక్క తమిళ రాష్ట్రంలోనే కాక ఇతర ప్రాంతాలలోను జైలర్ హంగామా నడుస్తుంది. ఇప్పటికే దేశంలో 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాహూబలి తరువాతి స్థానంలో నిలిచింది. జైలర్ చిత్రంలో రజినీకాంత్ కి […]

Jailer |
దాదాపు మూడేళ్ల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రంతో ఎంత పెద్ద హిట్ కొట్టారో మనం చూశాం. ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. నాలుగు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఇప్పటికీ దూసుకుపోతుంది. ఒక్క తమిళ రాష్ట్రంలోనే కాక ఇతర ప్రాంతాలలోను జైలర్ హంగామా నడుస్తుంది. ఇప్పటికే దేశంలో 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాహూబలి తరువాతి స్థానంలో నిలిచింది.
జైలర్ చిత్రంలో రజినీకాంత్ కి జోడీగా రమ్యకృష్ణ నటించగా, వారి కూతురు పాత్రలో మిర్నా మీనన్ నటించి మెప్పించింది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా మరో కీలక పాత్రలో కనిపించి సందడి చేసింది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, తెలుగు స్టార్ యాక్టర్ సునీల్, బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్, మలయాళీ నటుడు వినాయకన్, యోగిబాబు లాంటి నటులు ఈ చిత్రంలో కనిపించి సందడి చేశారు.
ఇదిలాఉండగా.. తాజాగా జైలర్ చిత్రంలో నటించిన ఈ నటీనటులు సినిమాకి ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారనే విషయం ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది. జైలర్ సినిమాలో నటించిన యాక్టర్ల పారితోషకం వివరాలు ఇవేనంటూ ఓ లిస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన రజనీకాంత్ ఏకంగా రూ.110కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది .ఇక సినిమాలో కీలకపాత్రలో కాసేపు కనిపించిన మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ రూ.8కోట్లు తీసుకున్నారని అంటున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించగా, ఆయనకి నిర్మాతలు రూ.4కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని సమాచారం
బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ రూ.4కోట్లు, తమన్నా భాటియా రూ.3కోట్లు, యోగిబాబు రూ.కోటి, రమ్యకృష్ణ రూ.80లక్షలు, వసంత్ రవి రూ.35లక్షలు, సునీల్‌కి రూ.60 లక్షలు,రెడిన్ కింగ్‌స్లే రూ.25 లక్షలు, వినాయకన్ రూ.35 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం బయటికి వచ్చింది.
ఇక ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. చిత్రంలో ‘కావాలా’ సాంగ్‍లో తమన్నా భాటియా స్టెప్పులు ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించగా, మూవీకి బడ్జెట్ 225 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది.