యుద్ధానికి జనసేనాని సిద్ధం!.. ప్రచార రథం ‘వారాహి’ ట్రయల్ రన్

విధాత: సినిమా నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందిన జన సేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరానికి సాయుధ సంపత్తిని రెడీ చేస్తున్నారు. అస్త్ర శస్త్రాల సంగతి తరువాత గానీ ముందుగా రథాన్ని సిద్ధం చేశారు. దానికీ వారాహి అంటూ దుర్గాదేవి పేరిట నామకరణం చేశారు. ఈ వాహనం వీడియోను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'వారాహి'… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ - అని ప్రకటించారు. ఈ వాహనాన్ని, ట్రయల్ రన్ […]

  • By: krs    latest    Dec 07, 2022 1:57 PM IST
యుద్ధానికి జనసేనాని సిద్ధం!.. ప్రచార రథం ‘వారాహి’ ట్రయల్ రన్

విధాత: సినిమా నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందిన జన సేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరానికి సాయుధ సంపత్తిని రెడీ చేస్తున్నారు. అస్త్ర శస్త్రాల సంగతి తరువాత గానీ ముందుగా రథాన్ని సిద్ధం చేశారు. దానికీ వారాహి అంటూ దుర్గాదేవి పేరిట నామకరణం చేశారు. ఈ వాహనం వీడియోను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘వారాహి’… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ – అని ప్రకటించారు.

ఈ వాహనాన్ని, ట్రయల్ రన్ ను పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి సూచనలు ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను చర్చించారు

దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు.. వారాహి

ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరు పెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు.. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. వాహనం తీరు తెన్నులు చూస్తుంటే పూర్తిగా బులెట్ , మైన్ ప్రూఫ్ అని అంటున్నారు.

జబల్ పూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారయ్యే ఆర్మీ ట్రక్కు “శక్తిమాన్” మాదిరి గానూ, ఇప్పటికే ఆర్మీలో ఉన్న టాటా ట్రక్కుల మాదిరిగానూ ఈ వాహనం కనిపిస్తోంది. సేనాని కాబట్టి రంగు కూడా మిలటరీ గ్రీన్ రంగును ఈ వాహనానికి వేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వాహనం విస్తృతంగా సర్క్యులేట్ అవుతుండగా అదే స్థాయిలో ట్రోలింగ్ కూడా మొదలైంది.

వాస్తవానికి ఏదైనా పార్టీ ప్రచార రథానికి ఆ పార్టీ రంగులు, ఎన్నికల గుర్తులు, జెండా వంటి కీలక చిహ్నాలు ఉండేలా చూస్తారు. ఆ వాహనం చూడగానే ఇది ఫలానా పార్టీ ప్రచార రథం అనేలా రంగులతో రూప కల్పన చేస్తారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుతోను, టీడీపీ సైకిల్ గుర్తుతోను, బీజేపీ కమలాన్ని, వైసీపీ ఫ్యాన్, బీఆరెస్ వాళ్ళు కారు గుర్తును తమ ప్రచార రథం మీద ప్రముఖంగా స్పష్టంగా కనిపించేలా ముద్రిస్తారు.

కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఆర్మీ ట్రక్కు మాదిరి వాహనాన్ని సిద్ధం చేశారు. బహుశా యుద్ధానికి వెళ్తున్నారు కాబట్టి ఇలా మిలటరీ ట్రక్కును పోలిన వాహనాన్ని సిద్ధం చేస్తున్నారేమో అని అంటున్నారు. కానీ ఈ రంగుతో వాహన అనుమతి రావడం కష్టమే. పైగా ఈ వాహనం అటు బస్సుగా గానీ లారీనా, సినిమా వారు వాడే కెరవానా అనేది ఎక్కడా స్పష్టం చేయలేదు.