దేవర చిత్రానికి జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దేవర. కోరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Janhvi Kapoor | యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దేవర. కోరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింమ్స్ భారీగా వ్యూస్‌ను సాధించింది. రెండురోజుల్లోనే 55 మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తున్నది. ఈ సినిమాతో అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నది.
తొలి చిత్రంతోనే అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో జతకడుతున్నది. దీంతో అందరి దృష్టి జాన్వీపై పడింది. వాస్తవానికి ఈ సినిమా కోసం మొదట జాన్వీ కపూర్‌ను రెండో హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇంతకు ముందు శ్రద్ధా కపూర్‌ను ఫస్ట్ హీరోయిన్‌గా ఎంపిక చేశారు. సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించేందుకు జాన్వీకి రూ.2కోట్లు రెమ్యునరేషన్‌కి మేకర్స్ ఒప్పించారని సమాచారం.
అయితే, ఏమైందే తెలియదు గానీ శ్రద్ధా కపూర్‌ను పక్కకు నెట్టి జాన్వీ కపూర్ లీడ్ రోల్‌కి మారింది. అయితే, హీరోయిన్‌గా లీడ్ రోల్ పోషిస్తున్నా.. అదే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. తన రెమ్యునరేషన్ పెంచాలని నిర్మాతలను అడగలేదని తెలుస్తున్నది. వాస్తవానికి జాన్వీ కపూర్ ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని వార్తలు వచ్చాయి.
అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తున్నది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఒక్కో చిత్రానికి రూ.3కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నది. దేవర చిత్రంలో నటించేందుకు రూ.2కోట్లకు ఒప్పుకోవడం విచిత్రమేనని పలువురు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. జాన్వీ కపూర్ చివరగా బావల్, దోస్తానా-2 చిత్రాల్లో కనిపించింది. దేవరతో పాటు బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటిస్తున్నది.