శంకరాభరణం చిత్రంతో విశ్వనాథ్ కళాతపస్విగా పేరొందారు..
K Vishwanath | తన చిత్రాల్లో ఏదో వైవిధ్యం ప్రదర్శించాలని తొలి నుంచి తపించేవారు కే విశ్వనాథ్. సంగీత, సాహిత్యాలకు కూడా పెద్దపీట వేసేవారు. కళలు కూడా స్ఫురినిస్తాయి. సంగీత, సాహిత్యాలు, కళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. 1980లో శంకరాభరణం చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. ఈ సినిమాకు కేవీ మహాదేవన్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా చేరువైంది. కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల […]

K Vishwanath | తన చిత్రాల్లో ఏదో వైవిధ్యం ప్రదర్శించాలని తొలి నుంచి తపించేవారు కే విశ్వనాథ్. సంగీత, సాహిత్యాలకు కూడా పెద్దపీట వేసేవారు. కళలు కూడా స్ఫురినిస్తాయి. సంగీత, సాహిత్యాలు, కళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. 1980లో శంకరాభరణం చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు.
ఈ సినిమాకు కేవీ మహాదేవన్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా చేరువైంది. కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి మేలిమలుపు అయ్యింది.
అంతగా పేరులేని నటీ నటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించటం విశేషం. ఈ చిత్రం దేశవ్యాప్తంగా శాస్త్రీయ సంగీతాభిమానుల ప్రశంశలను కూడా పొందింది. ఈ చిత్రం తర్వాత విశ్వనాథ్ కళా తపస్విగా పేరొందారు. శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే ఈ సినిమా ప్రభావం ఏంటో మనకు తెలిసిపోతుంది.
శంకరాభరణం ఉత్తమ సినిమాగా నంది అవార్డును సొంతం చేసుకోవడమే కాదు.. జాతీయ అవార్డు కూడా పొందింది. ‘బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ఫర్ ప్రోవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్’ విభాగంలో నేషనల్ అవార్డు అందుకుంది. ‘సప్తపది’, ‘స్వాతిముత్యం’, ‘సూత్రధారులు’, ‘స్వరాభిషేకం’ సినిమాలకూ నేషనల్ అవార్డులు వచ్చాయి. ‘స్వాతి ముత్యం’ సినిమాను ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో 59వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి అధికారికంగా పంపించారు.