KA PAUL | అధికారం ఇవ్వండి.. ఈ పనికిమాలిన ఎంపీల జీతాల్లో, వసతుల్లో కోత పెడతా: కే.ఏ. పాల్
విధాత: ప్రజాశాంతి పార్టీతోనే తెలుగు రాష్ట్రాల్లోని దళిత బడుగు వర్గాలకు రాజ్యాధికారం దక్కుతుందని ఇతర పార్టీల్లోని ఆ వర్గాల ప్రజలంతా ప్రజా పార్టీలో చేరాలని డాక్టర్ ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ. పాల్ (KA PAUL) కోరారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోడీ (Narendra Modi), రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వం ప్రజలకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం 118 లక్షల కోట్లు, […]

విధాత: ప్రజాశాంతి పార్టీతోనే తెలుగు రాష్ట్రాల్లోని దళిత బడుగు వర్గాలకు రాజ్యాధికారం దక్కుతుందని ఇతర పార్టీల్లోని ఆ వర్గాల ప్రజలంతా ప్రజా పార్టీలో చేరాలని డాక్టర్ ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ. పాల్ (KA PAUL) కోరారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
కేంద్రంలోని నరేంద్ర మోడీ (Narendra Modi), రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వం ప్రజలకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం 118 లక్షల కోట్లు, కేసిఆర్ ప్రభుత్వం ఐదు లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు . కాంగ్రెస్ 55 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ, లక్ష ఉద్యోగాలు ఇస్తారన్న కేసీఆర్ లు తమ హామీల అమలులో విఫలమయ్యారన్నారు.
తెలంగాణలో ప్రవీణ్ కుమార్, షర్మిల, మందకృష్ణ ప్రజాశాంతి పార్టీతో కలిసి పని చేయాలని కోరారు. కమ్మ కాపు, రెడ్ల కులస్తులకు ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన పార్టీలు చేసిందేమీ లేదని విమర్శించారు. వారు కూడా ప్రజాశాంతి పార్టీలో చేరాలని కోరారు.
కేటీఆర్ (KTR), బండి సంజయ్ (Bandi Sanjay)లు పంచాంగం భాషలో పెట్టిన ట్వీట్లు ఇద్దరవి సరైనవేనని.. అందుకే వారిని ప్రజలు వద్దనుకొని ప్రజలు మోడీ ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి బాయ్ బాయ్ చెప్పి ప్రజాశాంతి పార్టీకి వెల్కమ్ చెప్పబోతున్నారన్నారు.
ఉగాది పంచాంగం పేరుతో డబ్బులిచ్చి పార్టీలు ఎవరికి వారు అనుకూలంగా పంచాంగాలు చెప్పించుకు న్నారని విమర్శించారు. అప్పుల రాష్ట్రంగా మార్చిన సీఎం కేసీఆర్ పంట నష్టపోయిన రైతులకు పదివేలు ఇస్తామంటున్నారని వాటిని ఎక్కడి నుంచి తెస్తారన్నారు. కేసీఆర్ మాటలు మూర్ఖులు తప్ప ఎవరూ నమ్మడం లేదని, బెస్ట్ గోబెల్ అవార్డుకు కేసీఆర్ అర్హుడని అన్నారు.
నెలాఖరులోగా తెలుగు రాష్ట్రాల అన్ని జిల్లాల్లో ప్రజాశాంతి కార్యాలయాలు ప్రారంభిస్తామని ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరాలని పాల్ పిలుపునిచ్చారు. 1991 నుంచి తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చానని గూగుల్, ఇన్ఫోసిస్ సంస్థలను తీసుకువచ్చానన్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రపంచ సంపన్న పారిశ్రామికవేత్తల వద్ద ఉన్న డబ్బుతో తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టిస్తానన్నారు. అందరికీ ఉద్యోగాలు, అందరికీ ఉచిత విద్య, వైద్యం, పెన్షన్లు అందిస్తానన్నారు.
కులపాలన, కుటుంబ పాలన, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా ప్రజా శాంతి పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు. తెలుగు ఎంపీలు ప్రెస్ మీట్ పెడుతున్నారు. అసలు ఈ ప్రెస్మీట్‌లు ఎందుకు పెడుతున్నారు? ఎన్నడైనా ప్రజా సమస్యల మీద, నిరుద్యోగ సమస్యల మీద, 20 లక్షల పారా మిలిటరీ బలగాల సమస్యల మీద ఎన్నడైనా మాట్లాడారా? లక్షల రూపాయల వేతనాలు పొందుతూ.. వీళ్ళు ఏదో ఉద్దరించినట్టు .. ఏసీ ఫ్లైట్లు వీళ్లకు.. ఎన్టీఆర్‌కు అవకాశం ఇచ్చినట్టు తనకు అవకాశం ఇస్తే ఈ పనికి మాలిన ఎంపీల జీతాల్లో వసతుల్లో కోత పెడతానన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనను ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్నపై అక్రమ కేసులు పెట్టారన్నారు. తెలంగాణ పోలీసులను కొట్టాడని చంపబోయాడని పెట్టిన పోలీస్ కేసును సినిమా తీస్తే హిట్ అవుతుందన్నారు. గతంలో సీఎం కేసీఆర్ తనను కూడా అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేయాలని చూశారన్నారు. అందరికీ అధికారం, అందరి అభివృద్ధి, అందరి కోసం పాలన రావాలంటే ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావాలని, ప్రజలంతా దేవుని బిడ్డయైన తనకు సహకరించాలన్నారు.