ఆ మూడు పార్టీలకు మేఘా విరాళాలు : కేఏ పాల్

గత బీఆరెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా ఆ పార్టీలకు 1200కోట్ల విరాళాలు అందించడంతో విచారణ నామమాత్రమైందని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు.

ఆ మూడు పార్టీలకు మేఘా విరాళాలు : కేఏ పాల్
  • అందుకే సీబీఐ విచారణ కోరడం లేదు

విధాత: గత బీఆరెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా ఆ పార్టీలకు 1200కోట్ల విరాళాలు అందించడంతో విచారణ నామమాత్రమైందని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. గురువారం హైకోర్టు వద్ద కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు లక్షల కోట్లు ఖర్చయిందని, ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు రెండు లక్షల కోట్లు అప్పు అయ్యిందని ఆరోపించారు. తమ్ముడు రేవంత్ రెడ్డి గతంలో ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేస్తానని, సీబీఐ విచారణ జరిపిస్తామని చెప్పారని గుర్తు చేశారు.


కానీ ప్రాజెక్టు కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి గతంలో కలిసిన తర్వాత విచారణ చేయడం లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమ్ముడు రేవంత్ రెడ్డి ప్రాజెక్టు అవినీతిపై విచారణకు సీబీఐకి లేఖ రాయలేదన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సీబీఐ ఎంక్వైరీకి తాము సిద్ధమని కానీ సీఎం రేవంత్ రెడ్డి సీబీఐకి లేఖ రాయాల్సివుందనిని అనేక సార్లు అన్నారని గుర్తుచేశారు. అంతలోపునే ఆ మూడు పార్టీలకు మెఘా కృష్ణారెడ్డి 12 వంద కోట్లు ఎలక్ట్రో బాండ్ల రూపంలో ఇచ్చారని వెల్లడించారు. దీంతో ఈ పార్టీలన్నీ కూడా ఒకటేనని కేఏపాల్ తేల్చిచెప్పారు.


కేఏపాల్ తాజాగా హైకోర్టులో కాళేశ్వరంపై దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై పార్టీ ఇన్ పర్సన్‌ కేఏ పాల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కేఏపాల్ వేసిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ అనుమతి ఇచ్చింది. వచ్చే మంగళవారం రోజు పూర్తి స్థాయి వాదనలు వింటామన్న కోర్టు తెలిపింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. తన పిటిషన్‌ను విచారణకు అనుమతించడం తెలంగాణ ప్రజలకు శుభదినమని కేఏ పాల్ అభివర్ణించారు.