Guduru | కాళేశ్వరం అవినీతిపై.. కేంద్రం విచారణకు ఆదేశించాలి: గూడూరు
Guduru | Kaleshwaram Project కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలే.. డిపిఆర్లోనే అన్ని అబద్దాలు.. నిర్మాణ వ్యయంలో రూ.60 వేల కోట్ల వ్యత్యాసం బీజేపీ నేత గూడూరు డిమాండ్ విధాత: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించిన వివరాలపై విచారణకు ఆదేశించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి కేంద్రాన్ని కోరారు. గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసిన కాగ్ […]

Guduru | Kaleshwaram Project
- కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలే..
- డిపిఆర్లోనే అన్ని అబద్దాలు..
- నిర్మాణ వ్యయంలో రూ.60 వేల కోట్ల వ్యత్యాసం
- బీజేపీ నేత గూడూరు డిమాండ్
విధాత: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించిన వివరాలపై విచారణకు ఆదేశించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి కేంద్రాన్ని కోరారు.
గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసిన కాగ్ ప్రాజెక్టు అమలులో తీవ్ర అవకతవకలు జరిగాయని, రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసిందని ఆయన అన్నారు. శనివారం నాడు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక నుండి తప్పుకుందని, నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిందని ఆరోపించారు.
ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని పరోక్షంగా కాగ్ ధ్వజమెత్తిందని, కాగ్ పరిశీలనల ప్రకారం రాబోయే సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఐరావతంలాగా మారుతుందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఆధారంగా కేంద్రం రూ.81,911 కోట్ల వ్యయానికి అనుమతి ఇవ్వగా తాజా అంచనాల ప్రకారం ఖర్చు రూ.1.49 లక్షల కోట్లు దాటిందని గూడూరు వివరించారు.
‘‘డీపీఆర్‌లో చూపిన వ్యయానికి, ఇప్పటి వరకు చేసిన వాస్తవ వ్యయానికి మధ్య వ్యత్యాసం దాదాపు రూ.60,000 కోట్లు ఉందని, డీపీఆర్‌లోని అంచనాలకు, ప్రస్తుత అంచనాలకు మధ్య ఉన్న భారీ అంతరంపై ఉందని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.
వార్త కథనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు వినియోగించే విద్యుత్ ఖర్చు ఏడాదికి దాదాపు రూ.10,000 కోట్లు అవుతుందని చెప్పారు. ఒక్కో ఎకరాకు నీటి సరఫరాకు ఖర్చు రూ.46,364. అయిందని, ఇప్పటికే పూర్తయిన ఇతర ప్రాజెక్టుల లెక్కలతో పోల్చితే డీపీఆర్‌లో సమర్పించిన లెక్కలు అబద్ధమని తేలిందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒక టీఎంసీ నీటితో కేఎల్ఐపీ కింద 17 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, మిగతా ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద యూనిట్‌కు రూ.3 ఖర్చు అవుతుందని ప్రభుత్వం చెప్పడం వల్ల విద్యుత్ ఖర్చుపై కూడా అబద్ధం ఉందని, వాస్తవానికి యూనిట్‌కు రూ.6.40 ఖర్చు అవుతుందని అన్నారు.
“ప్రాజెక్ట్ కాస్ట్ బెనిఫిట్ రేషియోపై రాష్ట్ర ప్రభుత్వం కూడా అబద్ధం చెప్పింది. ఒక రూపాయికి కాస్ట్ బెనిఫిట్ రేషియో 1.51గా ఉంటుందని పేర్కొంది, అయితే అది ఒక్కో రూపాయికి 0.52గా ఉందని ఆయన అన్నారు.
163 టీఎంసీల నీటితో ప్రాజెక్టు కింద రెండు పంటలకు నీరు ఇవ్వవచ్చని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. అయితే ఈ నీరు ఖరీఫ్ సీజన్‌కు మాత్రమే సాగునీటి సౌకర్యం కల్పిస్తుందని కాగ్ గుర్తించిందని అన్నారు.
“ప్రాజెక్ట్ నిర్మాణంలో ఈ అవకతవకలన్నీ ఉన్న దృష్ట్యా, ఈ ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఉందని విచారణ జరిపేందుకు రాష్ట్రంలో సమర్థ దర్యాప్తు సంస్థ లేనందున కేంద్రం రంగంలోకి దిగాలని’’ ఆయన కోరారు.