Kalki 2898 AD | ఆసక్తి రేపుతున్న ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కే స్టార్‌కాస్ట్..! కీలక పాత్ర పోషించనున్న మరో దర్శకుడు..! ఆయన ఎవరో తెలుసా..?

Kalki 2898 AD | యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్‌ కే. మహానటి ఫేమ్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్‌ హీరోగా, బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సైన్స్‌ ఫిక్షన్‌ ఫాంటసీ చిత్రానికి ‘కల్కి 2829 AD’ పేరును ఖరారు చేసింది చిత్రం టీమ్‌. అయితే, ఈ చిత్రంలో భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సీనియర్‌ తారలు నటిస్తున్నారు. దీంతో […]

Kalki 2898 AD | ఆసక్తి రేపుతున్న ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కే స్టార్‌కాస్ట్..! కీలక పాత్ర పోషించనున్న మరో దర్శకుడు..! ఆయన ఎవరో తెలుసా..?

Kalki 2898 AD |

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్‌ కే. మహానటి ఫేమ్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్‌ హీరోగా, బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సైన్స్‌ ఫిక్షన్‌ ఫాంటసీ చిత్రానికి ‘కల్కి 2829 AD’ పేరును ఖరారు చేసింది చిత్రం టీమ్‌. అయితే, ఈ చిత్రంలో భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సీనియర్‌ తారలు నటిస్తున్నారు. దీంతో చిత్రంపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది.

ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హసన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రంతో దీపికా పదుకొణే తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రంలో టాలీవుడ్‌ దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి అతిథిపాత్రలో కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా మరో ప్రముఖ దర్శకుడు సైతం అతిథిపాత్రలో మెరవనున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

ఆ దర్శకుడు ఎవరో కాదు.. వివాదాల దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ చిత్రంలో తన పాత్రకు సంబంధించి షూటింగ్‌ను సైతం పూర్తి చేసినట్లు సమాచారం. ఇక చిత్రంలో తమిళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌, బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ, పశుపతి తదితర నటులు ముఖ్యపాత్రలు పోషించనున్నారు.

సైన్స్‌ ఫిక్షన్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తున్నది. సినిమాకు సంతోష్‌ నారాయణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించి టీజర్‌ విడుదల కాగా.. భారీగా హైప్‌ను పెంచింది. ‘ఈ ప్రపంచంలో చీకటి వచ్చినప్పుడల్లా ఒక శక్తి పుడుతుంది.

అలాంటి పవర్ ఇప్పుడు రాబోతుంది’ అనే డైలాగ్‌తో మొదలయ్యే ‘కల్కి’ గ్లింప్స్ ఈ సినిమా ఎలా ఉండబోతుందో చిన్న హింట్ ఇవ్వగా.. దుష్టశక్తుల నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించేందుకు ప్రభాస్ కల్కి అవతారంలో రానున్నట్లుగా తెలుస్తున్నది. ఇందులో లోక నాయకుడు కమల్‌ హసన్‌ ప్రతినాయకుడి పాత్రలో అలరించబోతున్నారు.