కామారెడ్డి, పాలకుర్తిలో పోలీసుల హల్‌చల్‌

పోలింగ్‌కు ముందు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌, పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని రెడ్డి ఇళ్ల వద్ద పోలీసులు మోహరించి తనిఖీలు నిర్వహించడం వివాదస్పదమైంది

కామారెడ్డి, పాలకుర్తిలో పోలీసుల హల్‌చల్‌
  • కాంగ్రెస్‌ అభ్యర్థుల ఇళ్ల వద్ద మోహరింపు


విధాత : పోలింగ్‌కు ముందు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌, పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని రెడ్డి ఇళ్ల వద్ద పోలీసులు మోహరించి తనిఖీలు నిర్వహించడం వివాదస్పదమైంది. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి నివాసం దగ్గర సీఐఎస్‌ఎల్‌, ఎస్‌ఐబీ పోలీసులు చేరుకోవడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.


కొండల్‌ రెడ్డి రేవంత్‌ రెడ్డి తరుపునా ప్రచార బాధ్యతలు నిర్వహిస్తు చీఫ్‌ ఏజెంట్‌గా ఉన్నారు. ఆయన ఇంట్లో సోదాలు చేపట్టడం పై కాంగ్రెస్‌ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అటు పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని ఇంటి వద్ద పోలీసుల హల్ చల్ చేశారు. అభ్యర్థి యశస్విని రెడ్డిని, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిని పోలీసులు దాదాపు గృహ నిర్భందం చేశారు.


ఇంట్లో డబ్బుల పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలతో పోలీసులు సోదాలు నిర్వహించి వారిని ఎవరు కలవకుండా కట్టడి చేశారు. బీఆరెస్‌ అభ్యర్ధి ఎర్రబెల్లి దయాకర్‌రెడ్డి ఓటమి భయంతో తమపై పోలీసు దాడులు జరిపిస్తున్నారని యశస్విని రెడ్డి ఆరోపించింది.