jagityala | బస్సు సీటు వివాదం.. SI స‌స్పెండ్‌.. భగ్గు మంటున్న జగిత్యాల

Karimnagar | jagityala శనివారం జగిత్యాల బంద్‌కు భ‌జరంగ్‌ద‌ళ్‌ పిలుపు * భార్య ఆత్మగౌరవం కాపాడుకోలేకపోతే, రివాల్వర్లు ఖాకీ డ్రెస్సులు ఎందుకు? ఎస్సై సస్పెన్షన్ పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు విధాత బ్యూరో, కరీంనగర్: ఆర్టీసీ బస్సులో సీటు పంచాయ‌తీ ఓ ఎస్సై సస్పెన్షన్ కు దారితీసింది. ప్రస్తుతం ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారుతోంది. జగిత్యాల కోరుట్ల మెట్టుపల్లి పట్టణాల్లో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తుల ఆందోళన నేపథ్యంలో ఎస్సై […]

jagityala | బస్సు సీటు వివాదం.. SI స‌స్పెండ్‌.. భగ్గు మంటున్న జగిత్యాల

Karimnagar | jagityala

  • శనివారం జగిత్యాల బంద్‌కు భ‌జరంగ్‌ద‌ళ్‌ పిలుపు
  • * భార్య ఆత్మగౌరవం కాపాడుకోలేకపోతే, రివాల్వర్లు ఖాకీ డ్రెస్సులు ఎందుకు?
  • ఎస్సై సస్పెన్షన్ పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

విధాత బ్యూరో, కరీంనగర్: ఆర్టీసీ బస్సులో సీటు పంచాయ‌తీ ఓ ఎస్సై సస్పెన్షన్ కు దారితీసింది. ప్రస్తుతం ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారుతోంది. జగిత్యాల కోరుట్ల మెట్టుపల్లి పట్టణాల్లో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తుల ఆందోళన నేపథ్యంలో ఎస్సై పై చర్య తీసుకున్న పోలీసుల వైఖరిని హిందూ సంస్థలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి.

భ‌జరంగ్ దళ్ ఏకంగా శనివారం జగిత్యాల బంద్ కు పిలుపునిచ్చింది. కరీంనగర్ జిల్లాలో మహిళల మధ్య మొదలైన ఈ వివాదం జగిత్యాల జిల్లా వరకు సాగింది. తనపట్ల అమానుషంగా వ్యవహరించారంటూ మైనార్టీ యువతి ఆరోపణలు చేసిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో పాటు ఎంఐఎం నేతల జోక్యంతో ఎస్సై అనిల్ సస్పెన్షన్ వరకు దారి తీసింది. ఆర్టీసీ బస్సు సీటు గురించి జరిగిన గొడవ చివరకు ఎస్సై కుర్చీకి ఎసరు పెట్టడం ఇప్పుడు హాట్ టాపికైంది.

తాను సిద్దిపేట నుండి ఆర్టీసీ బస్సులో వస్తున్నానని, మార్గ మధ్యలో ఓ మహిళ బస్సు ఎక్కిన తరువాత సీటు గురించి గొడవకు దిగారని బాధితురాలు ఆరోపించారు. అంతేకాకుండా వర్గ విబేధాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారంటూ ఆమెపై ఆరోపణలు చేశారు. జగిత్యాలలో దిగిన తరువాత కూడా ఈ వివాదం మరింత ఎక్కువగా కావడం వాహనంలో వచ్చిన ఆమె భర్త తనపై దురుసుగా ప్రవర్తించారంటూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో పాటు ఎంఐఎం నాయకులు కూడా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడడంతో బుధవారం సాయంత్రం ఎస్సై అనిల్ ను జగిత్యాల ఎస్సీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం జగిత్యాలకు వచ్చిన నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ కూడా పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి ఎస్సై అనిల్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల నుండి కూడా జనసమీకరణ చేసి జగిత్యాలలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇదే సమయంలో పోలీసు ఉన్నతాధికారులు ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన జారీ చేయడం గమనార్హం.