Karimnagar | కరీంనగర్‌లో NIA సోదాలు
Karimnagar విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ హుస్సేనీపురాలో ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) నిర్వహించిన సోదాలు సంచలనం సృష్టించాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో ఓ వ్యక్తి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. తబ్రేజ్ అనే వ్యక్తికి పీఎఫ్ఐ అనే నిషేధిత సంస్థతో సంబంధాలున్నాయనే అనుమానంతో అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం తబ్రేజ్ దుబాయ్ లో ఉంటున్నట్లు గుర్తించారు. తబ్రేజ్ ఇంట్లో ఉదయం నుంచి […]

Karimnagar
విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ హుస్సేనీపురాలో ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) నిర్వహించిన సోదాలు సంచలనం సృష్టించాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో ఓ వ్యక్తి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.
తబ్రేజ్ అనే వ్యక్తికి పీఎఫ్ఐ అనే నిషేధిత సంస్థతో సంబంధాలున్నాయనే అనుమానంతో అధికారులు
ఈ సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం తబ్రేజ్ దుబాయ్ లో ఉంటున్నట్లు గుర్తించారు.
తబ్రేజ్ ఇంట్లో ఉదయం నుంచి సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ బృందం తబ్రేజ్ కు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. స్ధానిక త్రీటౌన్ పోలీసులు, కరీంనగర్ ఏసీపీ నరేందర్ సహకారంతో ఎన్‌ఐఏ బృందం విచారణ నిర్వహించింది.