Karnataka | కర్ణాటకలో కొలువుదీరిన పూర్తి కేబినెట్
Karnataka విధాత: కర్ణాటక (Karnataka)లో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government)లో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) ప్రక్రియ పూర్తయ్యింది. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంది ఇప్పటికే ప్రమాణస్వీకారం చేయగా.. తాజాగా మరో 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో 34 మందితో సీఎం సిద్ధరామయ్య కేబినెట్ పూర్తిగా సిద్ధమైంది. కర్ణాటకలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ పూర్తయ్యింది. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు 8 మంది ఇప్పటికే […]

Karnataka
విధాత: కర్ణాటక (Karnataka)లో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government)లో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) ప్రక్రియ పూర్తయ్యింది. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంది ఇప్పటికే ప్రమాణస్వీకారం చేయగా.. తాజాగా మరో 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో 34 మందితో సీఎం సిద్ధరామయ్య కేబినెట్ పూర్తిగా సిద్ధమైంది.
కర్ణాటకలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ పూర్తయ్యింది. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు 8 మంది ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో సీఎం సిద్ధరామయ్య కేబినెట్ 34కు చేరింది.
శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో 23 మంది కొత్త ఎమ్మెల్యేలు కాగా.. చట్టసభలకు ప్రాతినిధ్యం వహించని ఎన్.ఎస్ బోస్‌రాజును మంత్రివర్గంలోకి తీసుకోవడం విశేషం. మాజీ ఎమ్మెల్యే అయిన బోస్‌రాజ్‌కు కాంగ్రెస్ హైకమాండ్ సూచన మేరకు మంత్రి పదవి ఇచ్చినట్లు పార్టీ నేత ఒకరు తెలిపారు. మొత్తం వర్గంలో ఒకే ఒక్క మహిళకు చోటు దక్కింది. బుళగావి రూరల్ నుంచి రెండోసారి ఎన్నికైన లక్ష్మీ హెబ్బాళ్కర్ ను కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఈమె పేరును డిప్యూటీసీఎం డికే శివకుమార్ ప్రతిపాదించారు.
మాజీ సీఎం ఆర్ గుండురావు తనయుడు దినేశ్ గుండురావు, మాజీ సీఎం బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర ఖండ్రేతో పాటు కృష్ణబైరేగౌడ, రహీంఖాన్, సంతోశ్‌లాడ్, కె.ఎన్. రాజణ్ణ, పిరియాపట్టణ వెంకటేశ్, హెచ్‌సి. మహదేవప్ప, బైరతి సురేశ్, శివరాజ్ తంగడిగి, ఆర్.బి. తిమ్మాపుర్, బి. నాగేంద్ర, డి. సుధాకర్, చలువ రాయస్వామి, మంకుళ్ వైద్య, ఎంసీ సుధాకర్, హెచ్‌కే పాటిల్, మాజీ సీఎం ఆర్. గుండురావు తనయుడు దినేశ్ గుండు రావు, మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర ఖండ్రేతో పాటు కృష్ణభైరేగౌడ, రహీంఖాన్, సంతోశ్‌లాడ్, కె.ఎన్.రాజణ్ణ, పిరియాపట్టణ వెంకటేశ్, హెచ్.సి.మహదేవప్ప, భైరతి సురేశ్, శివరాజ్ తంగడిగి, ఆర్.బి.తిమ్మాపుర్, బి.నాగేంద్ర, డి.సుధాకర్, చలువరాయస్వామి, మంకుళ్ వైద్య, ఎం.సి.సుధాకర్, హెచ్.కె.పాటిల్, శరణ్‌ప్రకాశ్ పాటిల్, శివానందపాటిల్, ఎస్.ఎస్.మల్లికార్జున, శరణబసప్ప దర్శనాపూర్ కూడా మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు.
మంత్రివర్గం ఏర్పాటైనప్పటికీ మంత్రిత్వ శాఖల కేటాయింపులపై అధికారికంగా ప్రకటన వెలువడలేదు. అయితే ఆర్థిక శాఖ, కేబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ వంటి ముఖ్యమైన శాఖలను సీఎం తనవద్దే ఉంచుకున్నట్టు సమాచారం. పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సీఎం సీటును త్యాగం చేసిన డీకే శివకుమార్‌కు బెంగళూరు నగరాభివృద్ధితో పాటు, నీటి పారుదల శాఖలను కేటాయించినట్లు సమాచారం. దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉన్నది.