తెలంగాణ ప్రజలను వంచించిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి: కోదండరాం

విధాత‌: సీఎ కేసీఆర్ తెలంగాణ ప్రజలు వంచించి, అమరుల త్యాగాలను ఉద్యమ ఆకాంక్షలను మరిచి అక్రమ సంపాదన, ఆధిపత్య రాజకీయాల కొరకే తహతహలాడుతున్నాడనీ, మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తెలంగాణ జన సమితి అభ్యర్థి పల్లె వినయ్ కుమార్ గౌడ్ గెలుపుని కాంక్షిస్తూ ఈరోజు తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో తూప్రాన్ పెట్ నుంచి నాంపల్లి వరకు నిర్వహించిన తెలంగాణ […]

  • By: Somu    latest    Oct 29, 2022 12:37 PM IST
తెలంగాణ ప్రజలను వంచించిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి: కోదండరాం

విధాత‌: సీఎ కేసీఆర్ తెలంగాణ ప్రజలు వంచించి, అమరుల త్యాగాలను ఉద్యమ ఆకాంక్షలను మరిచి అక్రమ సంపాదన, ఆధిపత్య రాజకీయాల కొరకే తహతహలాడుతున్నాడనీ, మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం పిలుపునిచ్చారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో తెలంగాణ జన సమితి అభ్యర్థి పల్లె వినయ్ కుమార్ గౌడ్ గెలుపుని కాంక్షిస్తూ ఈరోజు తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో తూప్రాన్ పెట్ నుంచి నాంపల్లి వరకు నిర్వహించిన తెలంగాణ జన సమితి జనయాత్రలు ఆయన పాల్గొని నియోజకవర్గంలోని వివిధ మండల కేంద్రాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా కోదండరా మాట్లాడుతూ.. బీజేపీ ఒక వ్యక్తి స్వార్థం కోసం ఎన్నికలను తీసుకొచ్చిందని టీఆర్ఎస్ పార్టీ నేమో తన ఆధిపత్యం నిరూపించుకుంటూ కొరకు ఈ ఎన్నికలను వ్యాపారంగా అత్యంత అప్రజా స్వామికంగ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని విమర్శించారు.

రెండు పార్టీలు ఓటర్లను వివిధ రూపాల్లో మభ్యపెడుతూ బేరాలుతున్నారని ఆయన విమర్శించారు. స్థానికంగా ప్రజా సమస్యలను ఈ ఎన్నికల్లో ఏజెండగా చర్చించకుండా కేవలం తమ ఆధిపత్యం కొరకు పరస్పర రాజకీయ విమర్శలతో పబ్బం గడుపు కుంటున్నారని ప్రజలను పక్కదో పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక పరిశ్రమంలో స్థానిక యువకులకు ఉద్యోగాలు కల్పించడంలో ఇరుపార్టిలు విఫలమైనాయని, వీరి వైఫల్యం మూలంగా చౌటుప్పల్ ప్రజలు కాలుష్య బారిన వడ్డారని ఆయన విమర్శించారు. కృష్ణా జిల్లాల్లో తెలంగాణ వాటాను నిర్ధారించడంలో ఈ రెండు పార్టీలు దొంగాటాడుతూ ఒకరినొకరు సహకరించుకుంటూ నల్లగొండ జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.

ప్రాజెక్టుల పేరుతో ప్రజల వద్ద నుండి బలవంతంగా లాక్కున్న భూములకు నష్టపరిహారం చెల్లించకుండా చర్లగూడెం ప్రాంత ప్రజలను బెదిరిస్తుననారని అన్నారు. చేనేత కార్మికులపై ప్రేమను వలుకబోస్తున్న ఇరువురు నాయకులు చేనేతపై జీఎస్టి ఎత్తివేయడంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి మంత్రం పట్టిస్తున్న కేసీఆర్ మరియు బిజెపి నాయకులు దమ్ముంటే మర్రిగూడెం చేరస్తాకు రావాలని చర్లగూడెం శివన్న గూడెం ప్రజల సాక్షిగా బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు.

జన సమితి మాత్రమే మునుగోడు ప్రాంత సమస్యలపై నిరంతరం పోరాడుతుందని ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడిందని ఆయన అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని వదులుకొని పోయినటువంటి కేసీఆర్ కు తెలంగాణ ప్రజలను ఓటు అడిగే అర్హత లేదని కోదండరాం విమర్శించారు . తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుట కొరకు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు తెలంగాణ జన సమితి అభ్యర్థి పల్లె వినయ్ గౌడ్ ను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

నియోజక అభ్యర్థి పల్లె వినయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి తన కాంట్రాక్టుల కోసమే మునుగోడు ఉప ఎన్నిక ప్రజల మీద రుద్దాడని విమర్శించారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఏనాడు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.

నిరంతరం ప్రజా ఉద్యమాల్లో ఉండే తాను నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మరియు అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం అక్రమంగా రద్దు చేసిన దళితుల , గిరిజనులకు భూపట్టాలు ఇప్పిస్తానని తెలిపారు.

ఈ యాత్రలో జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అంబటి శ్రీనివాస్,దర్మార్జున్, గోపగాని శంకర్రావు బైరి ,రమేష్ ఆశప్ప నిర్జన రమేష్ , కార్య దర్శులు, బొజ్జ కనకయ్య, ముక్కెర రాజు, నరసయ్య సలీం పాషా, లక్ష్మి, బాబు మహాజన్ మోహన్ రెడ్డి మల్లెల రామనాథం, నల్లగొండ జిల్లా అధ్యక్షులు పాన్నాల గోపాల్ రెడ్డి, మాంధ్ర మల్లయ్య , మారబోయిన శ్రీధర్ ,దేశపాక శ్రీను, స్రవంతి, పుష్ప నీల తుల్జా రెడ్డి, వెoకట్ రెడ్డి, ఆంజనేయులు శ్రీను నాయక్ వినయ్ గౌడ్ సూర్యనారాయణ రామచందర్ కార్తీక్ రెడ్డి కొత్త రవి తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.