ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు.. ఆయుధ పూజ

విధాత: దసరా పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. పవిత్ర జమ్మి ఆకును అక్కడ హాజరైన వారందరికీ పంచిన సీఎం పరస్పర శుభాకాంక్షలు అందించి, ఆశీర్వదించారు. అనంతరం ప్రగతి భవన్‌లో సీఎం ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, […]

  • By: krs    latest    Oct 05, 2022 7:08 AM IST
ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు.. ఆయుధ పూజ

విధాత: దసరా పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు.

పవిత్ర జమ్మి ఆకును అక్కడ హాజరైన వారందరికీ పంచిన సీఎం పరస్పర శుభాకాంక్షలు అందించి, ఆశీర్వదించారు. అనంతరం ప్రగతి భవన్‌లో సీఎం ఆయుధ పూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సీఎంవో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.