కేసీఆర్‌ను A1గా, కేటీఆర్‌ను A2గా చేర్చాల్సిందే: రేవంత్ రెడ్డి
విధాత: టీఆర్ఎస్, బీజేపీలు సమన్వయంతో పనిచేసుకుంటూ.. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ లేనట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక, భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రెండు పార్టీలు కావాలనే వ్యూహాత్మకంగా వివాదాలు సృష్టిస్తున్నాయని అన్నారు. మునుగోడు మండలం కొంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం వ్యవహారంలో కీలకంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు […]

విధాత: టీఆర్ఎస్, బీజేపీలు సమన్వయంతో పనిచేసుకుంటూ.. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ లేనట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక, భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రెండు పార్టీలు కావాలనే వ్యూహాత్మకంగా వివాదాలు సృష్టిస్తున్నాయని అన్నారు.
మునుగోడు మండలం కొంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం వ్యవహారంలో కీలకంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు. ఏసీబీ కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తున్నదన్నారు.
కేసీఆర్ పర్యవేక్షణలోనే ఈ వ్యవహారమంతా నడిచిందని ఆరోపణలు వస్తున్నాయి. అలాగైతే కేసీఆర్‌ను ఏ1గా, కేటీఆర్‌ను ఏ2గా చేర్చాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలను కూడా నిందితులుగా చేర్చాలన్నారు. దర్యాప్తు సంస్థలపై మాకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.