ఎంఐఎం బలోపేతానికే కేసీఆర్ కొత్త పార్టీ : కిష‌న్‌రెడ్డి

విధాత‌, హైద‌రాబాద్‌: మ‌జ్లిస్ బ‌లోపేతం కోస‌మే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నార‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి విమ‌ర్శించారు. సోమవారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని ఓడిస్తానని ఉత్తర కుమారుడిలా ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టినట్లు, అప్పుడే ప్రధాని అయినట్లు.. కేటీఆర్ సీఎం అయినట్లు కల్వకుంట్ల కుటుంబం పగటికలలు కంటోందని యెద్దేవా చేశారు. ఎంఐఎంను బలోపేతం చేయడానికే కేసీఆర్ కొత్త పార్టీ అని ఆరోపించారు. ప్రగతిభవన్‌కు అసదుద్దీన్‌ ఓవైసీ బుల్లెట్ బండిపై నేరుగా వెళ్తారన్నారు. […]

  • By: Somu    latest    Oct 03, 2022 10:08 AM IST
ఎంఐఎం బలోపేతానికే కేసీఆర్ కొత్త పార్టీ : కిష‌న్‌రెడ్డి

విధాత‌, హైద‌రాబాద్‌: మ‌జ్లిస్ బ‌లోపేతం కోస‌మే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నార‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి విమ‌ర్శించారు. సోమవారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని ఓడిస్తానని ఉత్తర కుమారుడిలా ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టినట్లు, అప్పుడే ప్రధాని అయినట్లు.. కేటీఆర్ సీఎం అయినట్లు కల్వకుంట్ల కుటుంబం పగటికలలు కంటోందని యెద్దేవా చేశారు.

ఎంఐఎంను బలోపేతం చేయడానికే కేసీఆర్ కొత్త పార్టీ అని ఆరోపించారు. ప్రగతిభవన్‌కు అసదుద్దీన్‌ ఓవైసీ బుల్లెట్ బండిపై నేరుగా వెళ్తారన్నారు. టీఆర్ఎస్‌కు మిగిలిన ఏకైక మిత్రపక్షం ఎంఐఎం మాత్రమే అని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. మునుగోడులో భారీ మెజార్టీతో గెలుస్తామని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

దేశంలో కేసీఆర్‌తో ఏ పార్టీ కలిసి రావడం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌తో ఏకీభవించలేదని అయన్ని కలిసిన నాయకులు చెబుతున్నారన్నారు. కేసీఆర్ ఏ లక్ష్యంతో కొత్త పార్టీ పెడుతున్నారో టీఆర్ఎస్ నేతలే అర్థంకాక తలలు పట్టుకుంటున్నారని కేంద్రమంత్రి అన్నారు.