Komati Reddy Venkat Reddy | RRR రైతుల భూములను కాపాడాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
విధాత: రీజనల్ రింగ్ రోడ్డు(RRR) భూసేకరణ తో పేద చిన్న సన్న కారు,రైతులకు అన్యాయం జరుగుతోందని అలైన్మెంట్ మార్పుతో వారికి న్యాయం చేయాలని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkat Reddy) జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ (Santosh Kumar Yadav) కు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో సంతోష్ కుమార్ యాదవ్ తో భేటియైన వెంకటరెడ్డి దాదాపు 40 నిమిషాలపాటు రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ […]

విధాత: రీజనల్ రింగ్ రోడ్డు(RRR) భూసేకరణ తో పేద చిన్న సన్న కారు,రైతులకు అన్యాయం జరుగుతోందని అలైన్మెంట్ మార్పుతో వారికి న్యాయం చేయాలని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkat Reddy) జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ (Santosh Kumar Yadav) కు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో సంతోష్ కుమార్ యాదవ్ తో భేటియైన వెంకటరెడ్డి దాదాపు 40 నిమిషాలపాటు రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ సమస్యలను కులంకషంగా వివరించారు.
అనంతరం భేటీ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ భూసేకరణ బాధితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అవసరానికి మించి భూసేకరణ జరుగుతోందన్నారు. ధీంతో ఎంతోమంది పేదలు నష్టపోతున్నారన్నారు. బాధిత రైతులు నిత్యం ధర్నాలు, ఉద్యమాలు చేస్తున్నారన్నారు.
తరతరాల నుంచి వస్తున్న కొద్దిపాటి భూమిని కోల్పుతున్న వారు RRR ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. అవసరం లేకున్నా భూములు తీసుకోవడం కరెక్ట్ కాదని, ప్రజల ఇబ్బందులను గుర్తించుకోవాలని, ఇంకా డిజైన్ అప్రూవల్ కానందునా అలైన్మెంట్ మార్పులతో బాధితులకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 500 కోట్లు చెల్లించలేదని, అంతలోనే చాలామందిని రోడ్డునపడేశారన్నారు.
గతంలో ఈ విషయంపై చర్చించేందుకు ఐదారు సార్లు వారి దృష్టికి సమస్యను తెచ్చానని పార్లమెంట్ లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తానన్నారు. ప్రైవేట్ భూముల్లో నుంచి కాకుండా ప్రభుత్వ భూముల్లోంచి వెళ్లేలా అలైన్మెంట్ మార్చాలన్నారు. ఎంత అవసరమో అంతే భూమిని తీసుకోవాలని, పేదలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. చైర్మన్ తాను చెప్పిన సమస్యలను విని సానుకూలంగా స్పందించారన్నారు. .ఈ విషయంలో తనవంతు సహకారం అందిస్తానని ఛైర్మన్ హామీ ఇచ్చినట్లు వెంకటరెడ్డి తెలిపారు.