కోమటిరెడ్డికి మతిభ్రమించింది: చాడ కిషన్ రెడ్డి ధ్వజం

విధాత: సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్గొండ నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధిని చూసి మాజీమంత్రి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మతిభ్రమించి విమర్శలు చేస్తున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చాడ కిషన్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన నల్గొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా పదవులు అనుభవిస్తూ ఏనాడు నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోని వెంకటరెడ్డి కంటికి నేడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపించకపోవడం విడ్డూరానికి […]

  • By: krs    latest    Feb 11, 2023 8:35 AM IST
కోమటిరెడ్డికి మతిభ్రమించింది: చాడ కిషన్ రెడ్డి ధ్వజం

విధాత: సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్గొండ నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధిని చూసి మాజీమంత్రి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మతిభ్రమించి విమర్శలు చేస్తున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చాడ కిషన్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన నల్గొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా పదవులు అనుభవిస్తూ ఏనాడు నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోని వెంకటరెడ్డి కంటికి నేడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపించకపోవడం విడ్డూరానికి గురి చేస్తుందన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంకోవైపు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్‌ను పేల్చివేయాలని బహిరంగంగా ప్రకటించగా, వెంకట్ రెడ్డి ప్రగతి భవన్‌ను కళాశాలలకు, ఆసుపత్రులకు కేటాయించాలని అంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం అనేది ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రి కార్యాలయంగా ఉంటుందన్న ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం చూసి జనాలు నవ్వుకుంటున్నారని చాడ ఎద్దవా చేశారు.

కాంగ్రెస్ 20 ఏళ్ల పాలనలో ఏనాడు ప్రజల బాగోగులు పట్టించుకోకుండా మీ స్వలాభాల కోసం చేసిన వాగ్దానాలు గాలికి వదిలేసి మీ అధినాయకుల అడుగులకు మడుగులు ఒత్తిన నాయకులు మీరంటూ వెంకట్ రెడ్డి పై విరుచుకు పడ్డారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి జగదీశ్‌ రెడ్డి సహకారంతో కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా అభివృద్ధి చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటిని ప్రారంభించి కూడా దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తుందన్న విషయం వెంకట్ రెడ్డి తెలుసుకోకపోవడం చాలా బాధాకరమన్నారు.

కేసీఆర్ గత ఎన్నికల్లో నల్లగొండను దత్తత తీసుకుంటానని ఇచ్చిన హామీ మేరకు నేడు ఎక్కువ నిధులు కేటాయించి అన్ని విధాలుగా సుందరీకరిస్తున్న విషయం వాస్తవం కాదా అని చాడ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లాకు ఐటీ హబ్ ను ఏర్పాటు చేయలేక పోయారన్నారు.

నేడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ జిల్లా కేంద్రానికి ఐటీ హబ్ శంకుస్థాపన చేసి నేడు యుద్ధ ప్రాతిపదికన భవన నిర్మాణం జరుగుతుందని, కొద్ది రోజుల్లోనే ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగా అవకాశాలు రానున్నాయన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీ డిగ్రీ కళాశాలకు నూతన భవనాన్ని కూడా శంకుస్థాపన చేసి భవన నిర్మాణం తుది దశకు చేరుకుందని గుర్తు చేశారు.

తుంగతుర్తి , మునుగోడులకు వంద పడకల ఆసుపత్రిలకు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ నుంచి ఆమోదం కూడా పొందిందన్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా నిలుస్తున్న ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వామన్నారు. వెంకట్ రెడ్డి, ఆయన సోదరుడు తలా ఒక పార్టీలో ఉంటూ పుటకో మాట రోజుకో వేషం వేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే గతంలో లాగానే రానున్న రోజుల్లో కూడా ప్రజలు మీకు మళ్లీ తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

ఇకనైనా మీ కుటిల బుద్ధిని మార్చుకొని మీరు ప్రభుత్వానికి,, నల్గొండ అభివృద్ధికి సలహాలు సూచనలు ఇచ్చి మీ గౌరవాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ నల్లగొండ మండల ఎంపీపీ నారా బోయిన బిక్షం యాదవ్, నాయకులు పోలే వెంకటాద్రి, ముక్కమల్ల వెంకన్న, యాదవ్ నారీ నరసింహ, ఎస్కే లతీఫ్, కర్నాటి మల్లేష్, కట్టా శ్రీనివాస్, కంచర్ల శ్రవణ్ గౌడ్, కొండాపురం అరుణ్ తదితరులు పాల్గొన్నారు.