మునుగోడు TRS అభ్యర్థిగా ‘కూసుకుంట్ల’ ఖరారు
విధాత: మునుగోడు అభ్యర్థిని టీఆర్ఎస్ ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును ఇవాళ ప్రకటించనున్నారు. ఆయనకు సీఎం కేసీఆర్ నేడు బీ ఫాం ఇచ్చే అవకాశం ఉన్నది. మంచిరోజు నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉండాలని కూసుకుంట్లకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. నేడు జాతీయ పార్టీ ప్రకటన పూర్తికాగానే టీఆర్ఎస్ నేతలు మునుగోడు ఉప ఎన్నికపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్‌కు ఎమ్మెల్యే ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించనున్నారు. కేటీఆర్, […]

విధాత: మునుగోడు అభ్యర్థిని టీఆర్ఎస్ ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును ఇవాళ ప్రకటించనున్నారు. ఆయనకు సీఎం కేసీఆర్ నేడు బీ ఫాం ఇచ్చే అవకాశం ఉన్నది. మంచిరోజు నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉండాలని కూసుకుంట్లకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు.
నేడు జాతీయ పార్టీ ప్రకటన పూర్తికాగానే టీఆర్ఎస్ నేతలు మునుగోడు ఉప ఎన్నికపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్‌కు ఎమ్మెల్యే ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించనున్నారు. కేటీఆర్, హరీశ్‌రావు సహా మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు కేటాయించారు.రేపటి నుంచి పూర్తిస్థాయిలో ప్రచారం చేయనున్నారు.
మునుగోడులు ఇప్పటికే భారీ బహిరంగ సభ నిర్వహించిన సీఎం ప్రచారం ముగిసే సమయానికి ఒకటి రెండు రోజుల ముందు చండూర్‌లోనూ మరో భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించారు. టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఐ, సీపీఎంతో సమన్వయం చేసుకుంటూ..కమ్యూనిస్టుల ఓట్లు టీఆర్ఎస్‌కు ట్రాన్స్‌పర్ అయ్యేలా వ్యూహ రచన చేస్తున్నారు.
మంత్రులు హరీశ్ రావు, జగదీశ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి లతో కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహించారు. నామినేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.