KTR | వెరీ గుడ్.. ఎమ్మెల్యే పెద్ది.. ‘ఉత్తర యుద్ధానికి’ మంత్రి కేటీఆర్‌ మద్దతు

KTR ఉత్తర యుద్ధం అద్భుత కార్యక్రమం రాష్ట్రమంతా కొనసాగిద్దాం రైతులకు మేలుచేసే కార్యక్రమం రాష్ట్ర మంత్రి కేటీఆర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉపాది హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రప్రభుత్వం పై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టిన 'ఉత్తర యుద్ధం' కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ (Minister KTR) పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లో గురువారం కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి […]

  • By: Somu    latest    Apr 27, 2023 12:50 AM IST
KTR | వెరీ గుడ్.. ఎమ్మెల్యే పెద్ది.. ‘ఉత్తర యుద్ధానికి’ మంత్రి కేటీఆర్‌ మద్దతు

KTR

  • ఉత్తర యుద్ధం అద్భుత కార్యక్రమం
  • రాష్ట్రమంతా కొనసాగిద్దాం
  • రైతులకు మేలుచేసే కార్యక్రమం
  • రాష్ట్ర మంత్రి కేటీఆర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉపాది హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రప్రభుత్వం పై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టిన ‘ఉత్తర యుద్ధం’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ (Minister KTR) పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లో గురువారం కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి మంత్రి కేటీఆర్ మద్దతు తెలిపారు.

అసెంబ్లీ తీర్మానం అమలు చేయాలి

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని కేటీఆర్ కోరారు. రైతులకు మేలు చేసే మంచి కార్యక్రమమన్నారు.

పెద్ది చేపట్టిన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు, నాయకులు, కేంద్రానికి ఉత్తరం రాస్తున్నారని తెలిపారు.